BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్.. (02/06/2025)
BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్.. (02/06/2025)
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఎప్పటికప్పుడు తెలుగులో బ్రేకింగ్ న్యూస్ అందిస్తున్న మన సాక్షి వెబ్సైట్ యూజర్లకు టాప్ ఫైవ్ బ్రేకింగ్ న్యూస్ సోమవారం నాటివి మీకు అందిస్తుంది. వాటిలో ముఖ్యమైన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే..
బిజెపితో బీఆర్ఎస్ పొత్తు :
బిజెపితో బీఆర్ఎస్ పొత్తుపై మాజీమంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బిజెపితో తమ పార్టీ ఎన్నటికీ పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తమ పార్టీ అధినేత కెసిఆర్ ఇటీవలనే చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినా తమ పార్టీ ఒంటరిగా పోటీ చేసి 100 స్థానాలతో అధికారంలోకి వస్తుందని హరీష్ రావు జోష్యం చెప్పారు.
————- ——-
జై జాగృతి.. జై కేసీఆర్.. :
బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత బిగ్ షాక్ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జాగృతి కార్యాలయంలో సోమవారం ఆమె ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆమె ప్రసంగించారు. ప్రసంగం పూర్తి అవగానే జై జాగృతి.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఆమె కొత్త పార్టీ కూడా అదేనా అని పలువురు భావిస్తున్నార
———- ——-
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం :
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు వద్ద లారీని కారు ఢీకొన్నది. రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరంతా రాజమహేంద్రవరం కవలిగొయ్యి గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు
——— ——-
రాజాసింగ్ ఫైర్ :
తనకు క్రమశిక్షణ నోటీసులు ఇస్తారనే ప్రచారంపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయట పెడతానని ఫైర్ అయ్యారు.
——— —-
నీట్ పీజీ పరీక్ష వాయిదా :
నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. జూన్ 15వ తేదీన జరగాల్సిన నీటి పరీక్ష వాయిదా పడింది. తిరిగి పీజీ పరీక్ష నిర్వహించే తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు NBE పేర్కొన్నది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు గాను పీజీ పరీక్షను వాయిదా వేసింది.
——– ——–









