Breaking Newsతెలంగాణరాజకీయం

TPCC : నేడు ప్రజాభవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. హాట్ టాపిక్స్..!

TPCC : నేడు ప్రజాభవన్ లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. హాట్ టాపిక్స్..!

హైదరాబాద్, మన సాక్షి :

టిపిసిసి కార్యవర్గ సమావేశం బుధవారం ప్రజాభవన్ లో జరగనున్నది. మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిపిసిసి కార్యవర్గం సమావేశం కావడం ఇది తొలిసారి. అందరికీ ఈ సమావేశంపై ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు, ఎంపీలు, కార్యవర్గ సభ్యులంతా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంతో పాటు పార్టీ కార్యక్రమాలపై టీపీసీసీలో చర్చ జరగనున్నది. మొదటిసారి ఈ సమావేశం నిర్వహించడం వల్ల హాట్ టాపిక్స్ ఉంటాయని నాయకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

BIG BREAKING : రైతులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, తొలి విడత రుణమాఫీ ఈనెల 18నే.. రేషన్ కార్డు పై కూడా స్పష్టత..!

శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం.. ఆల్మట్టికి ఇన్ ఫ్లో, సాగర్ ఆయకట్టులో ఆశలు..!

ఆల్మట్టి నుంచి దిగువకు నీరు.. సాగర్ ఆయకట్టులో ఎదురుచూపులు..!

 

మరిన్ని వార్తలు