క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. బావిలో ఈతకు వెళ్లిన ఇద్దరు మృతి..!

Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. బావిలో ఈతకు వెళ్లిన ఇద్దరు మృతి..!

హుజూర్ నగర్, (మనసాక్షి):

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని దద్దనాల చెరువు సమీపంలోని ఓ బావిలో ఈత కొట్టేందుకు దిగిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎనిమిది మంది గొర్రెల కాపరులు మేత కోసం హుజూర్ నగర్ ప్రాంతానికి వచ్చారు.

వీరిలో నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిమండ్ల గ్రామానికి చెందిన కనుమనూరు శేఖర్ (14), మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం చందాపురం గ్రామానికి చెందిన మోదీపురం లక్ష్మణ్ (21) బావిలో ఈత కొట్టేందుకు దిగారు. ఈత రాని లక్ష్మణ్ నీటిలో మునిగిపోగా, అతన్ని రక్షించేందుకు ప్రయత్నించిన శేఖర్ కూడా మునిగి ప్రాణాలు కోల్పోయాడు.శేఖర్ తమ్ముడు ఈ దృశ్యాన్ని చూచి మిగతా కాపరులకు సమాచారం ఇచ్చాడు.

సమాచారం అందుకున్న వెంటనే రిస్క్యూ టీం, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. శేఖర్ ఐదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది. వేసవి సెలవుల్లో కుటుంబానికి తోడ్పాటు అందించేందుకు గొర్రెల కాసేందుకు వచ్చాడు.పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుల వివరాలు సేకరిస్తున్నారు.

MOST READ : 

  1. Mercedes-Benz: మారకపు ధరల ప్రభావం.. రెండు దశల్లో మెర్సిడెస్-బెంజ్ కార్ల ధరల సవరణ..!

  2. Nalgonda : నల్గొండ జిల్లా దామరచర్ల లో దొంగల బీభత్సం.. బంగారం షాపు కొల్లగొట్టారు..!

  3. Hand Ball : జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ జట్టుకు ఎంపిక..!

  4. Fish : వాహ్.. సూపర్ మచ్చి.. జాలరీ కి చిక్కిన ఆరుదైన చేప…!

మరిన్ని వార్తలు