TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

Nizamabad : ఈ రహదారిపై ప్రయాణం నరకమే..!

Nizamabad : ఈ రహదారిపై ప్రయాణం నరకమే..!

ఆర్మూర్, మన సాక్షి:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుండి దారి హనుమాన్ రోడ్డు సమీపంలో-ఆలూర్-నందిపేట్ ప్రధాన రహదారిలో గుంతలు వాహనదారులకు ముసలిగా మారాయి. రోడ్డు మధ్యలో లోతుగా ఏర్పడిన చాలా గుంతలు.. వర్షాకాలంలో మరింత ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.

కొద్దిపాటి వర్షం పడినా గుంతల్లో నీరు నిలిచిపోవడంతో, వాటిని గుర్తించలేని డ్రైవర్లు ప్రమాదాల పాలవుతున్నారు.ప్రత్యేకంగా రాత్రివేళ ఎలాంటి వీధి దీపాలు లేకుండా ప్రయాణించే వాహనదారులు తారసపడిన ప్రమాదాలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు వాహనదారులు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బాధితులు చెబుతున్నారు.

రహదారి పరిస్థితిని అధికారం గౌరవించకుండా అధికారులు నిర్లక్ష్యంగా పర్వాలేదని పించుకుంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. తరచుగా వాహనదారులు గుంతల్లో పడిపోతూ ప్రమాదాలకు గురవుతుంటే, సంబంధిత శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.

ప్రజా రాకపోకలకు ప్రధాన రహదారిగా మారిన ఈ మార్గాన్ని అధికారులు వెంటనే తనిఖీ చేసి తగినచోట మరమ్మత్తులు చేయాలని, వాహన చోదకుల ప్రాణాలను గౌరవించి బాధ్యత వహించాలని స్థానికులు కోరుతున్నారు.

MOST READ : 

  1. Nano Urea : నానో యూరియా వాడకం ఎలా.. రైతులకు వ్యవసాయ అధికారుల సలహాలు.!

  2. Hyderabad : ఖజానా దొంగలు దొరికారు..! 

  3. District collector : ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో జాతీయ గీతం.. ఆలపించిన జిల్లా కలెక్టర్..!

  4. Thirumala : తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు 18న విడుదల.. వివరాలు ఇవీ.. బుకింగ్ ఇలా..!

మరిన్ని వార్తలు