Breaking Newstravelజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

TSRTC : ఆ రెండు రోజుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు టి ఎస్ ఆర్ టి సి శుభవార్త.. రూ. 5.5 0 లక్షల బహుమతులు..!

TSRTC : ఆ రెండు రోజుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు టి ఎస్ ఆర్ టి సి శుభవార్త.. రూ. 5.5 0 లక్షల బహుమతులు..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలియజేసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణించే మహిళలకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆడపడుచుల కోసం ఆర్టీసీ లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది.

 

ఈ డ్రా లో గెలుపొందిన మహిళలకు రూ 5.50 లక్షల విలువైన బహుమతులు అందించనున్నారు . ప్రతి ఆర్టీసీ రీజియన్ పరిధిలో ముగ్గురి మహిళల చొప్పున మొత్తం 33 మంది మహిళలకు బహుమతులు ఇవ్వనున్నారు. ఈనెల 30, 31 తేదీల్లో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రా లో పాల్గొనే అవకాశం కల్పించారు.

 

ప్రయాణ సమయంలో తీసుకునే టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నెంబర్ రాసి బస్టాండ్లలో ఏర్పాటుచేసిన బాక్స్ లలో వేయాల్సి ఉంటుంది.  ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురు చొప్పున విజేతలను ప్రకటించి బహుమతులను అందజేయనున్నారు. ఈ బహుమతులను ముఖ్యఅతిథిగా చేతుల మీదుగా మహిళలకు నేరుగా అందజేస్తారు.

 

MOST READ : 

  1. Raksha Bandhan : రక్షా బంధన్ పై సందిగ్ధం.. అదే రోజు భద్రకాలం, ఆ సమయంలో రాఖీ కట్టొద్దు..!
  2. Tea : టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.. టీలో అవి కలుపుకొని తింటే..!
  3. Crime News : కారు బానెట్ పై ఆ డాక్టర్ ను 50 మీటర్లు ఈడ్చుకెళ్లారు.. (వీడియో)
  4. Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
  5. Tragedy : ఆ తండ్రికి కూతురు అంటే అమితమైన ప్రేమ.. అనారోగ్యంతో కూతురు మృతి.. ఆ తర్వాత తండ్రి కూడా..!

 

మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చును. అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈ పండుగ సుదూర ప్రాంతాలలో ఉన్న సోదరులకు రాఖీ కట్టేందుకు ఆర్టీసీ బస్సులను బస్సులలో ప్రయాణించాలని అధికారులు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే మహిళలకు ఈ లక్కీ డ్రా ఏర్పాటు చేశారు .

 

గెలుపొందిన వారికి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీలోగా లక్కీ డ్రా లు నిర్వహించి విజేతలకు బహుమతులు  అందజేయనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , ఆర్టీసీ సంస్థ ఎండి సజ్జనల్ తెలిపారు. రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు తెలంగాణ ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040 – 6944 0000, 040 – 2345 00 33 సంప్రదించాలని సూచించారు.

 

ALSO READ : 

  1. ఓట్లు మావే సీట్లు మాకే అంటూ.. భారీ బైక్ ర్యాలీతో గళమెత్తిన బీసీ నాయకులు..!
  2. Green Gro : గ్రీన్ గ్రోలో జాతీయ క్రీడా, తెలుగు భాషా దినోత్సవం వేడుకలు
  3. Telangana : తెలంగాణ కొద్దిమంది చేతుల్లో బందీ అయింది

మరిన్ని వార్తలు