Vemulapally : రావులపెంట అంగన్వాడీ కేంద్రానికి ఎస్బీఐ సీఏస్ఆర్ సహకారం..!
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామంలో అంగన్వాడి-3వ కేంద్రానికి ఎస్బీఐ పాన్ ఇండియా సీఏస్ఆర్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎస్బీఐ ఆధ్వర్యంలో పిల్లలకు అవసరమైన అనేక ఉపకరణాలను అందజేశారు.

Vemulapally : రావులపెంట అంగన్వాడీ కేంద్రానికి ఎస్బీఐ సీఏస్ఆర్ సహకారం..!
వేములపల్లి, మన సాక్షి:
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామంలో అంగన్వాడి-3వ కేంద్రానికి ఎస్బీఐ పాన్ ఇండియా సీఏస్ఆర్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎస్బీఐ ఆధ్వర్యంలో పిల్లలకు అవసరమైన అనేక ఉపకరణాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఈడీ టీవీలు, రైస్ కుక్కర్లు, వాటర్ ఫిల్టర్లు, స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, పిల్లలకు సంబంధించిన పలకలు, పుస్తకాలు, పెన్సిళ్లు తదితర సామగ్రిని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ సందరబోయిన చంద్రయ్య ఎస్బీఐ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల విద్యా, పోషణాభివృద్ధికి ఇలాంటి సేవలు ఎంతో ఉప యోగపడతాయని ఆమె పేర్కొన్నారు. మిత్ర హోలి స్టిక్స్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి పాల్గొని పిల్లలకు తినే ప్లేట్లు, వాటర్ బాటిళ్లు,బ్యాగులు, ఎల్ ఈడీ టీవీలను అందజేశారు.ఈ కార్యక్రమంలోఎస్బీఐ తడకమళ్ళ బ్యాంక్ మేనేజర్ సతీష్, అంగన్వాడి టీచర్ శీలం శారద,వార్డు మెంబర్ ఇంద్రపల్లి నవ్య-నరేష్ ఆయా అనిత, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ
- Hyderabad : ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..10 నెలల తర్వాత వెలుగులోకి..!
- Hyderabad : అక్రమంగా గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్..!
- WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. 15 నిమిషాల్లోనే డిలీట్.. ఎలా పని చేస్తుందంటే..!
- Miryalaguda : ఫోన్ చేయగానే స్పందన.. ప్రాణదాత గా గోదాల..!









