Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా వెంకటేశ్వర్లు..!

Miryalaguda : సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా వెంకటేశ్వర్లు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో జరిగిన 23వ జిల్లా సిపిఐ పార్టీ మహాసభలో నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యులుగా బంటు వెంకటేశ్వర్లు ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో అనేక ఆటు పోట్లు తిని భూమికోసం, భుక్తి కోసం వ్యక్తి కోసం పేద ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పట్ల నిరంతరం ప్రజా పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతున్నదన్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల మీద తెచ్చిన మూడు నల్ల చట్టాలను పూర్తిస్థాయిలో ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా గ్రామీణ ఉపాధి కూలీ లకు 200 రోజులు పని కల్పించాలని, వారికి రోజు 500 రూపాయలు చెల్లించాలని, కార్మికులపై తెచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రైతుల పక్షాన, కార్మిక పక్షాన, వ్యవసాయ కూలీల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ ఎప్పటికప్పుడు వారి సమస్యలపై ప్రభుత్వాల మీద పోరాటాలు చేస్తామని అన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని అన్నారు.

అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లను పార్టీలకతీతంగా అర్హులను గుర్తించి వారికి ఇవ్వాలన్నారు. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద, స్థానిక సమస్యల మీద ప్రజలను కలుపుకొని ప్రజా పోరాటాలు చేస్తామన్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సస్పెండ్..!

  2. Minister KomatiReddy Venkatreddy : విద్యాశాఖ ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భావోద్వేగం..!

  3. Eggs : గుడ్లు పాడైన విషయం తెలుసుకోండిలా.. నిల్వ చేయడం ఎలా..!

  4. Social Media: రీల్స్‌కు బానిసయ్యారా.. ఈజీగా వదిలించుకోండిలా..!

మరిన్ని వార్తలు