Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Transco : ట్రాన్స్ కో ఎస్ ఈ గా అయితగోని వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ..!

Transco : ట్రాన్స్ కో ఎస్ ఈ గా అయితగోని వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ..!

నల్లగొండ, మన సాక్షి :

నల్లగొండ ట్రాన్స్కో సూపర్డెంట్ ఇంజనీర్ గా (ఎస్ ఈ) అయితగోని వెంకటేశ్వర్లు శుక్రవారం ఎస్ ఈ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు .నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ ఈ గా పని చేస్తూ నల్లగొండకు బదిలీపై వచ్చారు.

నల్లగొండ ఎస్ ఈ పోస్ట్ ఖాళీగా ఉండడంతో ప్రభుత్వం ఈయనను నల్లగొండకు బదిలీ చేసింది .ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో మెరుగైన నాణ్యతతో కూడిన విద్యుత్తును 24 గంటలు సరఫరా చేయడానికి కృషి చేస్తామన్నారు.

అలాగే గృహలక్ష్మి పథకం కింద అర్హులైన అందరికీ జీరో బిల్లులు వచ్చే విధంగా పనిచేస్తామన్నారు .గృహలక్ష్మి పథకం ఇప్పటివరకు వర్తించని అర్హులైన వారు అప్లై చేసుకోవచ్చన్నారు .ఉద్యోగులు వినియోగదారుల సహకారంతో పనిచేస్తామన్నారు.

ఇది కూడా చదవండి :

మరిన్ని వార్తలు