TOP STORIESBreaking Newsజాతీయం

WhatsApp DP : వాట్సప్ డిపి మార్చాలనుకుంటున్నారా.. మంచి లోకేషన్, అందంగా ఉండేలా కొత్త ఫీచర్..!

WhatsApp DP : వాట్సప్ డిపి మార్చాలనుకుంటున్నారా.. మంచి లోకేషన్, అందంగా ఉండేలా కొత్త ఫీచర్..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

వాట్సప్ డీపీ (డిస్ప్లే పిక్చర్) అందరూ కొద్ది రోజులకు ఒకసారి మార్చాలనుకుంటారు. మంచి డ్రెస్ వేసుకొని మంచి లొకేషన్ లో ఫోటో దిగి కొత్త ఫోటోలు మార్చాలనుకుంటారు. ఆ తర్వాత కొద్ది రోజులు గడిపేస్తారు. మళ్ళీ మరోసారి డిపి మార్చుకుంటారు. అయితే మంచి లోకేషన్ కు వెళ్లడం అవసరం లేకుండా ఇప్పుడు అందంగా కనిపించేలా వాట్సప్ లోనే కొత్త ఏఐ ఫీచర్ వచ్చింది.

అది ఎలా ఉపయోగించాలో చూద్దాం..

ఫోటోలో అందంగా హుందాగా కనిపించాలని సోషల్ మీడియాలో వాట్స్అప్, ఫేస్బుక్, ఇన్ స్టా, ఎక్స్ లాంటి వాటికి రెగ్యులర్ గా ఫోటోలు మార్చుకుంటారు. రకరకాల డ్రస్సులు లొకేషన్స్ లో ఫోజులు పెట్టి దిగేందుకు ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తుంది. అలాంటివన్నీ ఇక మీ ఫోన్లోని ఫీచర్ వచ్చేసింది.

ఏఐ సహాయంతో ఎక్కడికో వెళ్లి ఫోటోలు దిగాల్సిన అవసరం లేదు జస్ట్ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏఐకి మీ ఫోటోను అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. వాట్సాప్ ఏఐ ఫీచర్ అందిపుచ్చుకుంది. యూజర్స్ కి ఏఐ ఫీచర్స్ మరింత చేరువ చేసింది. కొత్త డిస్ప్లే పిక్చర్స్ ని మార్చే అవకాశాన్ని ఇచ్చింది. అది ఎలా సెట్టింగ్స్ మార్చాలో చూద్దాం..

వాట్సాప్ డీపీ ఎలా మార్చుకోవాలంటే

  • వాట్సాప్ ఓపెన్ చేయండి.

  • సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.

  • ప్రొఫైల్ పై క్లిక్ చేయాలి.

  • దానిలో ఎడిట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

  • క్రియేట్ ఆన్ ఏఐ ఇమేజ్ పైన క్లిక్ చేయాలి.

  • అక్కడ చాలా థీమ్స్ ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుని డిపి కి పెట్టేసుకోవచ్చును.

అయితే ఈ ఫీచర్ కొన్ని వెర్షన్ లోకి మాత్రం వచ్చింది. ఇంకా రాని వాళ్లకు త్వరలో రాబోతుంది. లేదా వాట్సప్ యాప్ ని అప్డేట్ చేసుకుంటే కనిపిస్తుంది.

ఎక్కువమంది చదివినవి (MOST READ)

మరిన్ని వార్తలు