గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులదే కీలక పాత్ర.. ఎంపిడిఓ సత్తయ్య..!
గ్రామాల్లో సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందేలా వార్డు సభ్యులు కృషి చేయాలని ఎంపీడీవో సత్తయ్య, ఎంపీఓ లక్ష్మణ్ సూచించారు.

గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులదే కీలక పాత్ర.. ఎంపిడిఓ సత్తయ్య..!
కంగ్టి, మన సాక్షి :
గ్రామాల్లో సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందేలా వార్డు సభ్యులు కృషి చేయాలని ఎంపీడీవో సత్తయ్య, ఎంపీఓ లక్ష్మణ్ సూచించారు. మండల కేంద్రమైన కంగ్టి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మండల పరిధిలోని భీమ్రా, భోర్గి, చౌకన్ పల్లి , చందర్ తండా, చాప్టా బీ,చాప్టా కే,దామరగిద్ద ( పీఎం )దెగుల్ వాడి ,ఎన్నెమురి , గాజుల పాడ్,10 గ్రామపంచాయతీల సంబంధించిన 94 మంది వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు బుధవారం నిర్వహించారు.
గ్రామపంచాయతీ పాలన, గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్లు విజయ్ కుమార్, అనిల్ కుమార్, వినయ్ కుమార్, జనార్దన్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ
- Suryapet : సూర్యాపేట పట్టణ మెయిన్ రోడ్డు పై ఆక్రమణ తొలగింపు..!
- Vemulapally : ఆమనగల్లు జాతరలో అపశృతి.. అగ్నిగుండంలో చిక్కిన భక్తులు..!
- Breaking News : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు ఢీకొని ఇంటర్ విద్యార్థి, మరో యువకుని మృతి..!
- Miryalaguda : శిష్య పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం..!









