Nagarjunasagar : సాగర్ లో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ ఉత్సవాలు..!
Nagarjunasagar : సాగర్ లో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ ఉత్సవాలు..!
నాగార్జునసాగర్, మన సాక్షి :
నాగార్జునసాగర్ లో పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక వృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలలో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా టూరిజం అండ్ పీస్ అనే నినాదంతో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
దీనిలో భాగంగా శుక్రవారం నాడు నాగార్జునసాగర్ లోని విజయ విహార్ ప్రాంగణంలో సాంప్రదాయ బద్ధమైన కోలాటం నృత్యాలతో, లంబాడీ నృత్యాలతో, బతుకమ్మలఆటలతో ,పాటలతో నిర్వహించిన పలు సాంకృతిక కార్యక్రమాలు పలువురుని ఆకట్టుకున్నాయి.
ప్రపంచ పర్యటక దినోత్సవo సందర్భంగా నాగార్జునసాగర్ లోని పర్యాటక ప్రాంతాలైన విజయ విహార్ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక విజయ విహార్ మేనేజర్ కిరణ్ కుమార్, సూపర్వైజర్ శ్రీధర్ ,పర్యాటక శాఖ సిబ్బంది సత్యనారాయణ, విజయకుమార్ మరియు టూరిజం సిబ్బంది పాల్గొన్నారు.
MOST READ :
-
Dussehra Bumper Offer : దసరా పండుగ బంపర్ ఆఫర్.. రూ.100కొట్టు మేకను పట్టు, లక్కీ డ్రా..!
-
CM Revanth Reddy : పేదలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. మెరుగైన వైద్యం కోసం నిర్ణయం..!
-
Swarnagiri : స్వర్ణగిరి క్షేత్రంలో కన్నుల పండుగ శ్రీవారి కల్యాణం..!
-
Suryapet : ఉండ్రుగొండ గిరిదుర్గం చరిత్ర.. పర్యాటక ప్రాంతంగా చేసేందుకు కృషి.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్..!









