యూట్యూబ్ తల్లి, గూగుల్ అమ్మ
యూట్యూబ్ తల్లి,గూగుల్ అమ్మ
రుద్రంగి, (మన సాక్షి)
కరీంనగర్ జిల్లా ఫోక్ యూట్యూబర్స్ నిర్వహిస్తున్న యూట్యూబ్ తల్లి గూగుల్ అమ్మ బోనాలు బద్ది పోచమ్మకు ఫిబ్రవరి 5వ తేదీన వేములవాడలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అన్ని రంగాల యూట్యూబర్స్ ఆధ్వర్యంలో బోనాల పండగ నిర్వహించడం జరుగుతుంది అని జానపద రచయిత పరశురాం నాగం అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
బుక్కెడు బువ్వను గుప్పెడు ప్రేమను కోట్లాది అభిమానాన్ని ప్రసాదించిన యూట్యూబ్ తల్లి మరియు గూగుల్ అమ్మకు కృతజ్ఞతతో ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ ఉమ్మడి కరీంనగర్ కళాకారులు నిర్వహించుకోవడం జరుగుతుంది అని,వేదిక మిద్దె రాములు గద్దె మహారాజ ఫంక్షన్ హాల్ వేములవాడలో జరుగుతుంది అని తెలిపారు.
ఇందులో భాగంగా గురువారం చందుర్తి మండలకేంద్రంలో బోనాల పోస్టర్ని ఆవిష్కరించారు. అన్ని రంగాల యూట్యూబర్స్ భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరావుల గంగ స్వామి,జోగినిపల్లి చందు,పరశురాం కంబల్ల,నాగం బాలశేఖర్,నాగం మురళి,నాగేష్,పొన్నం చంద్రమౌళి టీం, అరుణ్ టీం తదితరులు పాల్గొన్నారు.









