Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Heavy Rain : స్ట్రక్చర్ సహాయంతో నిండు గర్భిణిని వాగు దాటించిన 108 సిబ్బంది.. (వీడియో)

Heavy Rain : స్ట్రక్చర్ సహాయంతో నిండు గర్భిణిని వాగు దాటించిన 108 సిబ్బంది.. (వీడియో)

చింతపల్లి, మనసాక్షి :

ఒకపక్క ఎడతెరపి లేకుండా మెంథా తుఫాన్ వర్షం.. మరో ప్రక్క నిండు గర్భిణీకి పురటి నొప్పులు , నిండుగా ప్రవహిస్తున్న మైనంపల్లి వాగు. స్ట్రక్చర్ సహాయంతో గర్భిణీ మహిళను వాగు దాటించిన 108 సిబ్బంది..

దేవరకొండ మండలం మడమడక గ్రామానికి చెందిన,
జట్టి దేవి, నిండు గర్భిణీ స్త్రీ కి బుధవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో దేవరకొండ ప్రభుత్వ 108 కు కాల్ చేయడం జరిగింది. వెంటనే స్పందించిన చింతపల్లి 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే క్రమంలో ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు మైనంపల్లి వాగు ఉప్పొంగి రాకపోకలు బంద్ అయ్యాయి.

ఈ పరిస్థితుల్లో చింతపల్లి 108 సిబ్బంది రవి నాయక్, సైదులు లు భాదిత మహిళను స్ట్రక్చర్ సహాయంతో వాగు దాటించారు . అనంతరం ఆ గర్భిణీ స్త్రీని క్షేమంగా దేవరకొండ ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు.. ఈ సందర్భంగా ఆ గర్భిణీ స్త్రీ కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు, స్థానికులు 108 సిబ్బందిని అభినందించారు.

MOST READ : 

  1. Heavy Rain : గుర్రంపోడులో భారీ వర్షం.. ఇళ్లల్లోకి చేరిన వరద నీరు, నీట మునిగిన పంటలు..!

  2. Nalgonda : జలదిగ్బంధంలో కొమ్మేపల్లి గురుకుల పాఠశాల.. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలు..!

  3. Cyber crime : టీవీ రీఛార్జ్ కోసం ఫోన్ చేస్తే రూ.99 వేలు కొట్టేశారు..!

  4. Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!

  5. TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పదవులు రద్దు..!

మరిన్ని వార్తలు