Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking News

16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. 90 రోజుల లోపు దీనిని అమలు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. 13 – 16 మధ్య వయసున్న పిల్లల పైన ఆలోచన చేస్తున్నామని సోషల్ మీడియాతో నష్టం జరగకూడదన్నది తమ ఆలోచన అని పేర్కొన్నారు.

చిన్న పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం చూపుతోందని, దానివల్ల వారిలో మార్పులు వస్తున్నాయని, క్రమశిక్షణలోను అదుపుతప్పి పోతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాకు బానిసై మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నట్లు కొన్ని విషయాలు సైంటిఫిక్ గా రుజువు కావడంతో నిపుణుల నుంచి వస్తున్న డిమాండ్ల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు