Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఉద్యోగంతెలంగాణహైదరాబాద్

TG News : తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, కీలక శాఖలకు కొత్త బాధ్యతలు..!

తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, వివిధ శాఖల్లో కొత్త పోస్టింగ్‌లు, పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

TG News : తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, కీలక శాఖలకు కొత్త బాధ్యతలు..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ, వివిధ శాఖల్లో కొత్త పోస్టింగ్‌లు, పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి, ఇంధనం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం తదితర కీలక శాఖల్లో ఈ మార్పులు జరిగాయి.

కీలక అధికారుల బదిలీలు.. కొత్త బాధ్యతలు

జయేష్ రంజన్‌కు పర్యావరణ శాఖ బాధ్యతలు ఇవ్వగా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్‌ను మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (హెచ్‌ఎండీఏ పరిధి) శాఖ నుంచి పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖకు బదిలీ చేశారు. అదనంగా ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. క్రీడలు, హెరిటేజ్ తెలంగాణ విభాగాల ఎఫ్‌ఏసీ బాధ్యతల నుంచి ఆయనను తప్పించారు.

వికాస్ రాజ్‌కు ఇంధన శాఖ

రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వికాస్ రాజ్‌ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన స్థానంలో రవాణా, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా ఇళంబరితి కె. నియమితులయ్యారు. అదనంగా రవాణా కమిషనర్ బాధ్యతలు క డా ఆయనకు అప్పగించారు.

నవీన్ మిట్టల్‌కు పంచాయతీ రాజ్ :

నవీన్ మిట్టల్‌ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన ఎం. దానకిషోర్ స్థానంలో ఆయనకు బాధ్యతలు చేపట్టనున్నారు.

Also Read : కోతుల కోసం వల వేస్తే కొండచిలువ పడింది. భయంతో చంపేసిన రైతు..!

శైలజ రామయ్యర్‌కు రెవెన్యూ శాఖ

శైలజ రామయ్యర్‌ను రెవెన్యూ శాఖలోని ఎండోమెంట్స్ విభాగానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

ఇతర శాఖల్లో మార్పులు :

వాణి ప్రసాద్‌కు అదనపు బాధ్యతలు
వైఏటీ అండ్ సీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎ. వాణి ప్రసాద్‌కు క్రీడలు, హెరిటేజ్ తెలంగాణ విభాగాల పూర్తి అద నపు బాధ్యతలు అప్పగించారు.

రాహుల్ బోజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ ఎఫ్‌ఏసీ

రెవెన్యూ (డీఎం) శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బోజ్జాకు గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అదనంగా అప్పగించారు. బీసీ సంక్షేమ శాఖ ఎఫ్‌ఏసీ బాధ్యతల్లోనూ ఆయన కొనసాగనున్నారు.

సర్ఫరాజ్ అహ్మద్‌కు హెచ్‌ఎం డీఏ బాధ్యతలు

హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌ను మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమించారు. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారి బాధ్యతలను కూడా ఎఫ్‌ఏసీ కింద అప్పగించారు.

శృతి ఓఝాకు మహిళా, శిశు సంక్షేమ శాఖ

శృతి ఓఝాను మహిళా, శిశు అభివృద్ధి, షెడ్యూల్డ్ కులాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు.

తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న మహమ్మద్ ముషారఫ్ అలీ ఫరూఖీని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ బాధ్యతలను కూడా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలుగా అప్పగించారు. అదే సమయంలో TG SPDCL చైర్మన్, మేనేజింగ్ డైరె క్టర్ బాధ్యతలను ఎఫ్‌ఏసీ కింద కొనసాగించనున్నారు. మహిళా, శిశు అభివృద్ధి, షెడ్యూల్డ్ కులాల శాఖ డైరెక్టర్‌గా డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణను నియమించారు.

TGREDCO బాధ్యతలు జితేష్ వి. పాటిల్‌కు

TGSPDCL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్‌కు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (TGREDCO) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను అదనంగా అప్పగించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన మహమ్మద్ ముషారఫ్ అలీ ఫరూఖీని ఆబాధ్యతల నుంచి తప్పించారు.

మరిన్ని వార్తలు