Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Miryalaguda : రైతులకు కీలక సూచన.. యాసంగిలో ఈ పంటలు సాగు చేయాలి..!

మిర్యాలగూడ మండలంలోని కొత్తగూడెం రైతు వేదికలో నిర్వహించిన ప్రత్యేక రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థికంగా ఎదగడానికి ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించారు.

Miryalaguda : రైతులకు కీలక సూచన.. యాసంగిలో ఈ పంటలు సాగు చేయాలి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ మండలంలోని కొత్తగూడెం రైతు వేదికలో నిర్వహించిన ప్రత్యేక రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థికంగా ఎదగడానికి ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత సంఘాల సభ్యులు వివిధ ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, పీఏసీఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైతు సంఘాల ప్రతినిధులు, సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేసి రైతులకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.

Also Read : Miryalaguda : మిర్యాలగూడలో ఘోర ప్రమాదం.. లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..!

పంటల మార్పిడిపై అవగాహన :

యాసంగి సీజన్‌లో వరి పంట సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలైన పెసర్లు, మినుములు, నువ్వులు, వేరుశనగ, ఇతర పప్పుధాన్యాలు, కూరగాయలు తదితర పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఈ అంశంపై గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని, ఈ కార్యక్రమాలను డిసెంబర్ 15వ తేదీ వరకు కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఫార్మర్ రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేయాలి :

రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందేలా ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును 100 శాతం పూర్తి చేయడానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏ డి ఏ కోనిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి మేకల రుషేంద్ర మణి, ఏఈఓలు, ఎం. రమేష్ మలావత్, నల్గగంటి నాగయ్య, రూపావతి పార్వతి, పంచాయతీ కార్యదర్శి వీరన్న, సర్పంచ్, ప్రసాద్, పీఏసీఎస్ సీఈఓ సతీష్, నాగయ్య,, ప్రవీణ్ రెడ్డి, వెంకన్న,రవి, నాగిరెడ్డి, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు