Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Miryalaguda : రైస్ మిల్లర్ల సంచలన ప్రకటన.. ముందే చెప్తున్నాం, ఆ ధాన్యం కొనుగోలు చేయం..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆసియా ఖండంలోనే రైస్ మిల్లులకు రెండవ స్థానంలో నిలిచింది. ఇక్కడ వరి ధాన్యం అధిక దిగుబడి వస్తున్న విషయం తెలిసిందే. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్న మిర్యాలగూడలో వరి ధాన్యం పండించే రైతులే అధికంగా ఉన్నారు.

Miryalaguda : రైస్ మిల్లర్ల సంచలన ప్రకటన.. ముందే చెప్తున్నాం, ఆ ధాన్యం కొనుగోలు చేయం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆసియా ఖండంలోనే రైస్ మిల్లులకు రెండవ స్థానంలో నిలిచింది. ఇక్కడ వరి ధాన్యం అధిక దిగుబడి వస్తున్న విషయం తెలిసిందే. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్న మిర్యాలగూడలో వరి ధాన్యం పండించే రైతులే అధికంగా ఉన్నారు.

కాగా వివిధ రకాల వారి ధాన్యం మార్కెట్లోకి రావడంతో రైతులు అధిక దిగుబడి వచ్చే దాన్యమును పండించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాలలో రైస్ మిల్లర్లు వారికి ఉపయోగపడే ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులు అనవసరంగా ఆ ధాన్యమును పండించి ఇబ్బందులు పడవద్దు అని ముందే చెప్తున్నామని ప్రకటించారు.

ఆదివారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, మిర్యాలగూడ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఎడమ కాలు ఆయకట్టు పరిధిలో రైతులు వానాకాలం సీజన్ లో కే ఎన్ ఎం 12510 రకం విత్తనాలు సాగు చేస్తే కొనుగోలు చేయబోమని సంచలన ప్రకటన చేశారు.

గత సంవత్సరం కెఎన్ఎమ్ 12 510 రకం విత్తనాలు సాగు చేస్తే రైతులకు దిగుబడులు ఎక్కువ వచ్చాయని కానీ వాటికి నాణ్యత లేదని పేర్కొన్నారు. హెచ్ఎంటి, జైశ్రీరామ్, చింటూ రకం దాన్యం ఉన్నంత నాణ్యతగా ఆ ధాన్యం లేదని పేర్కొన్నారు. మిల్లింగ్ చేసే ప్రక్రియలో ఆ రకం బియ్యం అమ్ముడుపోవడం లేదని పేర్కొన్నారు. దాంతో రైస్ మిల్లర్లు నష్టపోవాల్సి వస్తుందని అందువల్ల ఈ సీజన్ కు ముందే చెప్తున్నామని కె ఎన్ ఎం 12 510 సాగు చేయవద్దని పేర్కొన్నారు.

అందుకు రైతులు కూడా సహకరించాలని, ప్రభుత్వం ఎంపిక చేసిన ఎనిమిది రకాల విత్తనాలలో ఇది లేనందున రైతులు సాగు చేయవద్దని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఉన్నతాధికారులకు కూడా వినతి పత్రాలు అందజేస్తామని వారు తెలిపారు. సమావేశం లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మిర్యాలగూడ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి, కార్యదర్శి పోలిశెట్టి ధనుంజయ, కోశాధికారి గందె రాము, మిల్లర్లు బండారు కుశలయ్య, రేపాల అంతయ్య తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి : 

మరిన్ని వార్తలు