Breaking Newsక్రైంజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లా
అక్రమంగా నల్ల బెల్లం పట్టిక తరలిస్తున్న వాహనం సీజ్..!
అక్రమంగా తరలిస్తున్న 600 కేజీల నల్ల బెల్లం , 120 కేజీల పట్టికను పట్టుకున్న ఘటన బుధవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

అక్రమంగా నల్ల బెల్లం పట్టిక తరలిస్తున్న వాహనం సీజ్..!
వెల్దండ, మన సాక్షి :
అక్రమంగా తరలిస్తున్న 600 కేజీల నల్ల బెల్లం , 120 కేజీల పట్టికను పట్టుకున్న ఘటన బుధవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కమిషన్ కల్వకుర్తి సీఐ వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు వెల్దండ గ్రామ శివారులో హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా హైదరాబాద్ బేగంబజార్ నుంచి (ఏపీ 20పి 0549) లో స్కార్పియో వాహనం సీజ్ చేసి, ఇస్లావత్ రాజు, తలకొండపల్లి మండలం మేఘి తండ అనే వ్యక్తి మన్ననూర్ గ్రామంలో అక్రమంగా నాటు సారా తయారీదారులకు తరలిస్తుండగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి, వాహనాన్ని సీజ్ చేశామని తెలిపారు. ఈ తనిఖీలో సీఐతోపాటు సిబ్బంది జనార్దన్ రెడ్డి, సిద్ధార్థ, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.









