Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

మక్తల్‌లో వ్యభిచార ముఠా అరెస్ట్..!

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని నారాయణపేట రోడ్డులో మహీంద్రా షోరూమ్ సమీపంలోని ఎస్ వి ఎన్ లాడ్జ్‌ పై గురువారం పోలీసులు దాడి చేశారు.

మక్తల్‌లో వ్యభిచార ముఠా అరెస్ట్..!

మక్తల్, మనసాక్షి :-

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని నారాయణపేట రోడ్డులో మహీంద్రా షోరూమ్ సమీపంలోని ఎస్ వి ఎన్ లాడ్జ్‌ పై గురువారం పోలీసులు దాడి చేశారు. వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్, మక్తల్ ఎస్సై రాజు ఆధ్వర్యంలో లాడ్జి పై దాడి చేశారు.

యజమాని పి. భాస్కర్ రెడ్డి, అతని సహాయకుడు లింగప్ప నవాజ్ తో పాటు ముగ్గురు పురుషులు ఏడుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. దాడిలో 10 సెల్ ఫోన్లు, రూపాయలు 7800  నగదు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఎస్సై మాట్లాడుతూ సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు, ముఖ్యంగా వ్యభిచారం, మాదకద్రవ్యాలు మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. అధికారులు ప్రజలు తమ ప్రాంతాల్లో అనుమానాస్పద లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు.

MOST VIEWS : 

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు