Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుమహబూబ్‌నగర్

పిల్లలమర్రిలో శ్రీ శ్రీనివాస పెట్రోల్ బంక్ ఘనంగా ప్రారంభ..!

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పిల్లలమర్రి రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీనివాస పెట్రోల్ బంక్ ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.

పిల్లలమర్రిలో శ్రీ శ్రీనివాస పెట్రోల్ బంక్ ఘనంగా ప్రారంభ..!

మహబూబ్ నగర్ టౌన్ – శ్రీశైలం, మన సాక్షి:

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పిల్లలమర్రి రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీనివాస పెట్రోల్ బంక్ ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… నూతన పెట్రోల్ బంక్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన సర్వీసు, నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించాలని సూచించారు.

పిల్లలమర్రి రోడ్డులో వాహనదారులకు ఈ బంక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెట్రోల్ బంక్ యాజమాన్యం మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు