హాస్టల్ నుంచి బయలుదేరిన యువకుడు అదృశ్యం..!
గ్రామానికి వెళ్తున్నానని చెప్పి హాస్టల్ నుంచి బయలుదేరిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.

హాస్టల్ నుంచి బయలుదేరిన యువకుడు అదృశ్యం..!
(శేరిలింగంపల్లి – శ్రీనివాసచారి, మన సాక్షి)
గ్రామానికి వెళ్తున్నానని చెప్పి హాస్టల్ నుంచి బయలుదేరిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బీహార్లోని పాట్నాకు చెందిన మాజీ సైనికుడు కమలేష్ కుమార్ సింగ్ కుమారుడు తనీష్ కుమార్ సింగ్ (22), జూలై 15న నగరానికి వచ్చాడు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఏజైల్ సెక్యూరిటీ ఏజెన్సీ తరఫున సెక్యూరిటీ గార్డుగా చేరుతూ ఆసుపత్రి హాస్టల్లోనే నివాసముంటున్నాడు.
ఈక్రమంలో అక్టోబర్ 8న ఉదయం 8 గంటల సమయంలో సొంతూరు వెళ్తున్నానని తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం రెండు మొబైల్ ఫోన్లు, లగేజీతో హాస్టల్ నుంచి బయలుదేరాడు. అయితే అతడు గ్రామానికి చేరుకోకపోవడంతో కంగారుపడిన తండ్రి హైదరాబాద్కు వచ్చి పరిసర ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది.
దీంతో బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 22 ఏళ్ల వయస్సు గల తనీష్ కుమార్ సింగ్ ఆచూకీ తెలిసిన వారు వెంటనే స్థానిక పోలీసులకు గానీ, రాయదుర్గం పోలీస్ స్టేషన్లో గానీ సమాచారం అందించాలని కోరారు.









