నేరం చేసి.. కారం చల్లి.. అయినా.. ఆట కట్టించిన పోలీసులు.. ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
దొంగతనం చేసిన ఇంట్లో వేలిముద్రలు లభించకుండా కారం పొడి చల్లి తప్పించుకోవాలని చూసిన ఓ నిందితుడిని కరీంనగర్ రూరల్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో పట్టుకున్నారు.

నేరం చేసి.. కారం చల్లి.. అయినా.. ఆట కట్టించిన పోలీసులు.. ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
(కరీంనగర్ బ్యూరో – నరేష్, మనసాక్షి)
దొంగతనం చేసిన ఇంట్లో వేలిముద్రలు లభించకుండా కారం పొడి చల్లి తప్పించుకోవాలని చూసిన ఓ నిందితుడిని కరీంనగర్ రూరల్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో పట్టుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలసాని అజయ్‌ను బుధవారం బొమ్మకల్ సమీపంలోని కోకాకోలా ధాబా వద్ద అరెస్టు చేశారు.
ఈ వివరాలను రూరల్ సీఐ ఏ. నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్‌కు చెందిన అజయ్ ఇంటర్ చదువుతున్న సమయంలోనే దొంగతనాలకు పాల్పడటం ప్రారంభించాడు. మానకొండూరు మండలం ఊటూరు బ్యాంకు దోపిడీ కేసుతోపాటు సుల్తానాబాద్‌లో జరిగిన మూడు దొంగతనాల కేసుల్లో గతంలో అరెస్టయ్యాడు.
2025లో హైదరాబాద్‌లోని ఏఎంబీ షాపింగ్ మాల్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేసిన సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రాజుతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ బైక్‌పై శ్రీశైలం వెళ్లి తిరిగి వస్తుండగా నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చొరబడి రెండున్నర తులాల బంగారం, నగదు అపహరించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : Nalgonda : ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా గుట్టురట్టు, అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన మిర్యాలగూడ పోలీసులు..!
కారం పొడి చల్లి తప్పించుకునే యత్నం
కాశీ వెళ్లాలనే ఉద్దేశంతో కరీంనగర్ చేరుకున్న అజయ్.. రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ విజయ్‌నగర్ కాలనీలో ఓ ఇంట్లో చొరబడి పావు తులం బంగారం, 25 తులాల వెండి అపహరించినట్లు పోలీసులు వెల్లడించారు. వేలిముద్రలు లభించకుండా ఉండేందుకు ఇంట్లోని కారం పొడిని ఆనవాళ్లపై చల్లినట్లు పేర్కొన్నారు. గత ఆగస్టులో జరిగిన ఈ చోరీ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నాట్‌గ్రిడ్ సాంకేతికత సాయంతో నిందితుడికి సంబంధించిన వివరాలను సేకరించారు.
సాంకేతిక ఆధారాలతో అజయ్‌ను గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం కరీంనగర్ కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన రూరల్ సీఐ, పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.









