Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District Collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. మూడు రోజులు వరి కోతలు వాయిదా వేసుకోవాలి..!

ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు మూడు రోజుల పాటు వరి కోతలను వాయిదా వేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు.

District Collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. మూడు రోజులు వరి కోతలు వాయిదా వేసుకోవాలి..!

(సూర్యాపేట – ముత్యంరాజు, మనసాక్షి)

ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు మూడు రోజుల పాటు వరి కోతలను వాయిదా వేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. వర్షాలకు కోసిన ధాన్యం తడిస్తే తేమ శాతం పెరిగి నాణ్యత దెబ్బతినడంతో పాటు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు కోతలు చేపట్టవద్దని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.

ఇప్పటికే వరి కోతలు పూర్తిచేసిన రైతులు ధాన్యం వర్షానికి తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచి, టార్పాలిన్లు, ఇతర కవర్లతో కప్పి కాపాడుకోవాలన్నారు.

Also Read : Miryalaguda : రైతులకు కీలక సూచన.. యాసంగిలో ఈ పంటలు సాగు చేయాలి..!

వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ, పంటలు వర్షాలకు తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తున్నారని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విస్తృతంగా సమాచారం అందిస్తామని పేర్కొన్నారు. రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించి పంట నష్టాన్ని నివారించుకోవాలని కలెక్టర్ కోరారు.

మరిన్ని వార్తలు