Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణ

Karimnagar : భార్య హత్య కేసులో భర్త అరెస్ట్‌..!

పిల్లలు కలగడం లేదనే కారణంతో భార్య స్వరూపను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త దావు చంద్రకుమార్‌ను కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Karimnagar : భార్య హత్య కేసులో భర్త అరెస్ట్‌..!

కరీంనగర్‌ బ్యూరో – నరేష్, మనసాక్షి :

పిల్లలు కలగడం లేదనే కారణంతో భార్య స్వరూపను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె భర్త దావు చంద్రకుమార్‌ను కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 25వ తేదీ రాత్రి కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న చంద్రకుమార్‌కు పిల్లలు కలగకపోవడంతో భార్యతో విభేదాలు ఏర్పడ్డాయి. విడాకులు తీసుకోవాలనే తన నిర్ణయానికి భార్య, ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నెల 25వ తేదీ రాత్రి మద్యం సేవించిన చంద్రకుమార్‌.. భార్యను తీసుకెళ్లాలని ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశాడు.

Also Read : Miryalaguda : మిర్యాలగూడలో మహాతేజ రైస్ మిల్లులో.. వరిపొట్టులో కూరుకుపోయి డ్రైవర్ మృతి.. న్యాయం కోసం ఆందోళన..!

వారు రాకపోవడంతో ఆగ్రహానికి గురై, రాత్రి 11.30 గంటల సమయంలో తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న స్వరూప గొంతు పిసికి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద ఉన్నట్లు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సమాచారం అందింది.

దీంతో కరీంనగర్‌ రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏ. నిరంజన్‌రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రైలు ఎక్కి వేరే ప్రాంతానికి వెళ్లి తలదాచుకోవాలనే ఉద్దేశంతో రైల్వే స్టేషన్‌కు వచ్చినట్లు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు