Miryalaguda : కెఎల్ఎన్ జూనియర్ కళాశాలలో ఉచిత దంత వైద్య పరీక్షలు..!
Miryalaguda : కెఎల్ఎన్ జూనియర్ కళాశాలలో ఉచిత దంత వైద్య పరీక్షలు..!

Miryalaguda : కెఎల్ఎన్ జూనియర్ కళాశాలలో ఉచిత దంత వైద్య పరీక్షలు..!
మిర్యాలగూడ, మనసాక్షి :
లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320ఈ జిల్లా గవర్నర్ కె .వి .ప్రసాద్ పుట్టిన రోజు సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ తరుణ ఆధ్వర్యం లో ప్రముఖ దంత వైద్యులు లయన్ కళ్యాణ్ కుమార్, లయన్ అక్షిత గౌడ్ లు కె ఎల్ ఎన్ జూనియర్ కాలేజీలో 400 మంది విద్యార్థులకు దంతాల ఆరోగ్యం పై అవగాహన, ఉచిత పరీక్షలు నిర్వహించారు. అవసరం అయిన వారికి చికిత్స అందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లయన్ చిలుకూరు బాలకృష్ణ మాట్లాడుతూ దంతాల ఆరోగ్యం అన్ని అవయవాల ఆరోగ్యానికి మూలం అని అన్నారు. రసాయనాలు లేని పేస్ట్ లను వాడాలని సూచించారు. ఉచిత పరీక్షలు నిర్వహించిన క్లబ్ సభ్యులను వైద్యులను అభినందించారు.
17 వ వార్డ్ కౌన్సిలర్ వెలుగు ఇందిరా నాగరాజు 20 వ వార్డ్ కౌన్సిలర్ దేశిడి శ్రీలేఖ శేఖర్ రెడ్డి, లక్మన్, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ లయన్ క్యామ వెంకటేశం , క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ అనుముల మధుసూదన్ రెడ్డి, లయన్ సాధినేని శ్రీనివాస రావు , లయన్ నేతి వెంకటేశ్వర్లు , కళాశాల కరెస్పాండంట్ లయన్ బికుమాళ్ళ కిరణ్ కుమార్ , డైరెక్టర్ హనుమంత రెడ్డి లు పాల్గొన్నారు.









