Miryalaguda : మిర్యాలగూడలో మహాతేజ రైస్ మిల్లులో.. వరిపొట్టులో కూరుకుపోయి డ్రైవర్ మృతి.. న్యాయం కోసం ఆందోళన..!
మిర్యాలగూడ శివారు శెట్టిపాలెం లోని మహతేజ రైస్ మిల్లులో బాయిలర్ డ్రైవర్ వరిపొట్టులో కూరుకుపోయి మృతిచెందాడు.

Miryalaguda : మిర్యాలగూడలో మహాతేజ రైస్ మిల్లులో.. వరిపొట్టులో కూరుకుపోయి డ్రైవర్ మృతి.. న్యాయం కోసం ఆందోళన..!
మిర్యాలగూడ, మనసాక్షి :
మిర్యాలగూడ శివారు శెట్టిపాలెం లోని మహతేజ రైస్ మిల్లులో బాయిలర్ డ్రైవర్ వరిపొట్టులో కూరుకుపోయి మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. న్యాయం కోసం అద్దంకి – నార్కట్ పల్లి రహదారి పై రాస్తారోకో చేశారు. పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం తాళ్లగడ్డ కాలనీకి చెందిన మండలి నాగరాజు (38) గత కొంతకాలంగా మహతేజ రైస్ మిల్లులో బాయిలర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
Also Read : District Collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన రైతుల ధాన్యానికి మద్దతు ధర చెల్లించాల్సిందే..!
సోమవారం పొట్టు ఎలివేటర్ సమస్య రాగా దాన్ని క్లీన్ చేస్తుండగా ఒక్కసారిగా వరిపొట్టు అతడిపై పడి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన మిల్లు సిబ్బంది నాగరాజును బయటకు తీసి మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి మృతికి మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మిల్లు ఎదుట మృతదేహాన్ని ఉంచి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : హైడ్రామా.. పక్కా ప్లాన్.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్..!
వారు స్పందించకపోవడం తో నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సీఐ పీఎన్డీ. ప్రసాద్, ఎస్ఐ సురేష్ రెడ్డి మిల్లు యాజమా న్యంతో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టు మార్థం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు హర్షిణి, జాహ్నవి ఉన్నారు.









