Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్

వాల్మీకి మహర్షి ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం.. మంత్రి వాకిటి శ్రీహరి

వాల్మీకి మహర్షి జీవితం, ఆయన బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

వాల్మీకి మహర్షి ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం.. మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్ టౌన్ – సత్యనారాయణ రెడ్డి, మనసాక్షి

వాల్మీకి మహర్షి జీవితం, ఆయన బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.  మక్తల్ పట్టణంలో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ……

భారతీయ సంస్కృతి, సాహిత్య చరిత్రలో వాల్మీకి మహర్షికి విశిష్టమైన స్థానం ఉందన్నారు. రామాయణ మహాకావ్యాన్ని రచించి, ప్రపంచానికి ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను చాటిచెప్పిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని కొనియాడారు. ఆయన రచించిన రామాయణం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తూ, సమాజానికి నైతిక విలువలను బోధిస్తోందని పేర్కొన్నారు.

Also Read : పెట్టుబడుల పేరుతో కోట్లలో టోపీ..!

వాల్మీకి మహర్షి జీవితం పరివర్తనకు ప్రతీకగా నిలుస్తుందని, మనిషి తన ఆలోచనలు, ఆచరణ ద్వారా ఉన్నత స్థాయికి ఎదగవచ్చనే సందేశాన్ని ఆయన జీవితం అందిస్తుందని అన్నారు. వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని మంత్రి పిలుపునిచ్చారు.

మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించడంతో పాటు వారి సేవలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి, సమానత్వానికి, సామాజిక ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి అభిప్రాయపడ్డారు .

మరిన్ని వార్తలు