తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన అక్షిత
చింతపల్లి మండల పరిధిలోని చాకలి శేరిపల్లి గ్రామానికి చెందిన అక్షిత జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించడంతో పాటు, భారత జట్టుకు ఎంపికై తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన అక్షిత
(చింతపల్లి – వెంకట్, మనసాక్షి )
చింతపల్లి మండల పరిధిలోని చాకలి శేరిపల్లి గ్రామానికి చెందిన అక్షిత జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించడంతో పాటు, భారత జట్టుకు ఎంపికై తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం అక్షితను రమావత్ రవీంద్ర కుమార్ అభినందించారు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో జరిగిన జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పాల్గొన్న అక్షిత అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించింది.
Also Read : నల్గొండ జిల్లాలో దారుణం.. విద్యుత్ కోతల కారణంగా ఎండిపోతున్న వరి పంటలు..!
తన ప్రతిభతో జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఆమె తాజాగా భారత జట్టుకు ఎంపికైంది. ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ఎంపిక కావడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. అక్షిత తన ప్రతిభతో తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Also Read : District Collector : సైబర్ల్ నేరాలపై జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కీలక సూచన.. సైబర్ ముఠా అరెస్ట్..!
అంతర్జాతీయ పోటీల్లోనూ విజయాలు సాధించి మరిన్ని పతకాలు సాధించాలని కోరుతూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 19 నుంచి 23 వరకు శ్రీలంకలో జరగనున్న ఆసియన్ త్రోబాల్ ఛాంపియన్షిప్లో అక్షిత భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుందని రవీంద్ర కుమార్ తెలిపారు. ఈ పోటీల్లోనూ అక్షిత ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాచర్ల శ్రీశైలం, ఉప సర్పంచ్ పగడాల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.









