నల్గొండ జిల్లాలో దారుణం.. విద్యుత్ కోతల కారణంగా ఎండిపోతున్న వరి పంటలు..!
రాష్ట్రంలో విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వేసిన పంటలు ఎండిపోవడంతో రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్ నాయక్ అన్నారు.

నల్గొండ జిల్లాలో దారుణం.. విద్యుత్ కోతల కారణంగా ఎండిపోతున్న వరి పంటలు..!
( చింతపల్లి – వెంకట్, మనసాక్షి )
రాష్ట్రంలో విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వేసిన పంటలు ఎండిపోవడంతో రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్ నాయక్ అన్నారు. శుక్రవారం చింతపల్లి మండల లో వివిధ దగ్గర గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుకాలం కష్ట పడి వేసిన పంటలు సమయానికి కరెంటు లేక ఎండిపోతున్న వరి పోలాలు ఉన్న కొన్ని గంటలైనా లో-ఓల్టేజ్ సమస్య కారణం మోటార్లు కాలిపోవడం, పక్కనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న రైతులకు కనీసం సాగు నీరు లేక బోర్ల కింద ఉన్న పంటలు ఎండి పోవడం చేత రైతులు ఆందోళన చెందుతున్నారు అని వారు ఆవేదన వ్యక్త పరిచారు.
Also Read : నల్గొండ జిల్లాలో దారుణం.. విద్యుత్ కోతల కారణంగా ఎండిపోతున్న వరి పంటలు..!
చింతపల్లి మండలం ప్రశాంత పూరి తండా కు చెందిన రైతుల ఎండి పోయిన వరి పంటను చూసిన కేతావత్ బీల్యా నాయక్ ఈ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారు. తెలంగాణ రాష్ట్రం లో 24గంటల విద్యుత్ అందించి రైతుల పక్షాన పెద్దన్న పాత్ర పోషించిన కేసిఆర్ పాలన ను గుర్తు చేశారు.రైతులను అన్ని విధాలా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం వుండదని రైతు ఉసురు తాకి పోతారని రైతు ఎడ్చిన రాజ్యం.ఎద్దు ఎడ్చిన వ్యవసాయం ఎక్కువ కాలం నిలవదని సమాజానికి అన్నం పెట్టే అన్నదాత సంతోషంగా వుంటేనే ఈ రాష్ట్రం అయిన దేశం అయినా సుభిక్షంగా ఉంటుందన్నా రు.
Also Read : Breaking : రోడ్డుపై వెళ్తున్న కారులో మంటలు.. క్షణాల్లోనే పూర్తిగా దగ్ధం.!
ఈ రాష్ట్రం లో నిర్లక్ష్య పాలకుల కారణంగా ఎండిపోతున్న వరి పంటలను చూసి రైతుల తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రజా సంక్షేమ పాలని లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మోస పూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు ఆసన్నమయ్యే అన్నారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.








