Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
Breaking : రోడ్డుపై వెళ్తున్న కారులో మంటలు.. క్షణాల్లోనే పూర్తిగా దగ్ధం.!
రోడ్డుపై వెళ్తున్న కారులో మంటలు చెలరేగి క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా జరిగింది.

Breaking : రోడ్డుపై వెళ్తున్న కారులో మంటలు.. క్షణాల్లోనే పూర్తిగా దగ్ధం.!
మన సాక్షి, వెబ్ దెస్క్:
రోడ్డుపై వెళ్తున్న కారులో మంటలు చెలరేగి క్షణాల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డులో కారు రోడ్డుపై వెళ్తుండగా కారులో ఒకసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ప్రయాణికులు నలుగురు వెంటనే అప్రమత్తమై కిందికి దిగారు. కాగా మంటలు కారు పూర్తిగా వ్యాపించి నిమిషాల్లోనే పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.









