District Collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ప్రభుత్వ పాఠశాల ఆకస్మిక తనిఖీ..!
నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు.

District Collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ప్రభుత్వ పాఠశాల ఆకస్మిక తనిఖీ..!
నల్లగొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. నల్గొండలోని బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థులు పరీక్షలో ప్రథమ ర్యాంకులు సాధిస్తే రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత ఖర్చుల తో ఢిల్లీ పర్యటనకు తీసుకెళ్లనున్నారని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.
విమాన ప్రయాణ ఖర్చులతో పాటు, ఇతర ఖర్చు లు, షాపింగ్ ఖర్చులను కూడా ఆర్ అండ్ బి శాఖ మంత్రి భరిస్తారని, ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తారని చెప్పారు.
శనివారం జిల్లా కలెక్టర్ బొట్టు గూడలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పా ఠ శాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు,మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
7 తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, విద్య పురోగతి, సమస్యలను అడిగి తె లుసుకున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారని? చదువులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా ? అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు బా గా బోధిస్తున్నారని, తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని విద్యా ర్థులు కలెక్టర్కు తెలిపారు.
అనంతరం పదవ తరగతిని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ పదవ తరగతి కష్ట పడి చదివి మంచి మార్కులు సా ధించాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని సూచించారు. రిఫ్లెక్షన్, నాన్ రిఫ్లెక్షన్కు సంబంధించిన అంశా లపై ప్రశ్నించగా, విద్యార్థులు బో ర్డుపై సమాధానాలను వివరించి న తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
Also Read : Nalgonda : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. దుకాణాలపై తూనికలు, కొలతల అధికారుల తనిఖీలు..!
8,9,10 తరగతుల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పాఠశాల ప్రిన్సి పల్ సురేష్ కుమార్ ను ఆదేశించారు. తక్కువ మార్కులు సా ధించిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, ప్రతి విద్యార్థికి నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించి మెరుగైన మార్కులు సాధించేలా బోధన అందించాలని చెప్పారు. విద్యా ర్థుల పరీక్షల జవాబు పత్రాలను పరిశీలించి, వారి అభ్యసన స్థా యిని అంచనా వేశారు.
మూత్రశాలలు పరిశీలించిన కలెక్టర్, నీటి కుళాయిల్లో లీకేజీలు లేకుండా చూడాలని, అవసర మై న చోట కొత్త కుళాయిలను ఏ ర్పాటు చేయాలని ఆదేశించారు. నీటి వృథాను అరికట్టేందుకు పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల కు అవగాహన కల్పించాలని చె ప్పారు.
ఎల్నినో ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో నీటి వి నియోగంపై మరింత అప్రమత్తం గా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రతి నీటి చుక్కను పొదుపు గా వినియోగించుకోవాలని, ఎక్కడా నీరు వృథా కాకుండా విద్యా ర్థులు బాధ్యతగా వ్యవహరిం చాలని చెప్పారు. పాఠశాలలో ప్రతిరోజూ ఉదయం ప్రార్థన సమ యంలో విద్యార్థులతో నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు. విద్యార్థులు చదువుతో పాటు, సామాజిక బాధ్యత అలవర్చు కోవాలని, నీటి సంరక్షణపై తమ ఇంటితోపాటు, పరిసర ప్రాంతా ల్లోనూ ప్రచారం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిం చడం, వెనుకబడిన విద్యార్థులను ముందుకు తీసుకురావడం ద్వారా మెరుగైన విద్యా ఫలితాలు సాధించాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. అడిషనల్ డైరెక్టర్ రామాచారి, ఎంఈఓ అరుంధతి, ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్, సు ధారాణి, వెంకటేశ్వర్లు తదితరు లు ఉన్నారు.









