Nalgonda : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. దుకాణాలపై తూనికలు, కొలతల అధికారుల తనిఖీలు..!
నల్లగొండ పట్టణంలో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల అధికారులు సంయుక్తంగా దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం బియ్యం దుకాణాలు, కిరాణా షాపులు, వంట నూనెల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు.

Nalgonda : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. దుకాణాలపై తూనికలు, కొలతల అధికారుల తనిఖీలు..!
నల్లగొండ, మన సాక్షి :
నల్లగొండ పట్టణంలో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల అధికారులు సంయుక్తంగా దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం బియ్యం దుకాణాలు, కిరాణా షాపులు, వంట నూనెల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నాలుగు కేసులు నమోదు చేశారు. జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి, జిల్లా పౌరసరఫరాల అధికారులు, డీటీ సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
Also Read : Miryalaguda : మిర్యాలగూడలో అండర్ పాస్ ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు..!
దుకాణాల్లో వినియోగిస్తున్న తూనికల పరికరాల ధృవీకరణ, అధికారిక ముద్రలు, తూనికలు కొలతలకు సంబంధించిన నిబంధనల అమలును క్షుణ్ణంగా పరిశీలించారు. లీగల్ మెట్రాలజీ చట్టం– 2009, సంబంధిత నిబంధన ల ను ఉల్లంఘించిన వ్యాపార సం స్థలపై అధికారులు కేసులు నమోదు చేశారు. వ్యాపారులు ధృవీకరణ పొంది, అధికారిక ముద్ర లు కలిగిన తూనికల పరికరాలనే వినియోగించాలని స్పష్టం చేశారు.
వినియోగదారులకు సరైన తూకం అందించడంతో పాటు చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తూనికలు, కొలతల్లో అక్రమాల కు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. విని యోగదారులు తక్కువ తూకం, తప్పుడు కొలతలు లేదా ఇతర ఉల్లంఘనలను గుర్తించినప్పుడు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. వినియోగదారుల హక్కుల పరిర క్షణే లక్ష్యంగా తనిఖీలు కొనసా గుతాయని అధికారులు స్పష్టం చేశారు.








