Breaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్
ఆపరేషన్ SEAL–మీ.. క్షేత్రస్థాయిలో తనిఖీల పర్యవేక్షణ..!
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నివారణ, నిఘా పటిష్ఠత, ప్రజల భద్రత లక్ష్యంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ SEAL–M(Securing Entry and Exits Locations of Malakjigiri)లో భాగంగా కమిషనరేట్ వ్యాప్తంగా 54 నాకాబందీ కేంద్రాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు.

ఆపరేషన్ SEAL–మీ.. క్షేత్రస్థాయిలో తనిఖీల పర్యవేక్షణ..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నివారణ, నిఘా పటిష్ఠత, ప్రజల భద్రత లక్ష్యంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ SEAL–M(Securing Entry and Exits Locations of Malakjigiri)లో భాగంగా కమిషనరేట్ వ్యాప్తంగా 54 నాకాబందీ కేంద్రాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు.
Also Read : ఆమనగల్లులో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
ఈ సందర్భంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి వివిధ నాకాబందీ కేంద్రాలను సందర్శించి, కొనసాగుతున్న తనిఖీలను సమీక్షించారు. తనిఖీలు సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.









