Breaking Newsక్రైంజిల్లా వార్తలురంగారెడ్డి
Breaking : బైక్ను ఢీకొట్టిన వాహనం.. పంచాయతీ కార్యదర్శికి తీవ్ర గాయాలు
ఆమనగల్లు ఖానాపూర్ పలుగు గుట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Breaking : బైక్ను ఢీకొట్టిన వాహనం.. పంచాయతీ కార్యదర్శికి తీవ్ర గాయాలు
ఆమనగల్లు – ఇమ్రాన్, మనసాక్షి:
ఆమనగల్లు ఖానాపూర్ పలుగు గుట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెల్జాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి వాజీద్ ఆమనగల్లు నుంచి వెల్జాల్కు తన విధులకు హాజరు కావడానికి బైక్పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది.
Also Read : ఆమనగల్లులో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
ఈ ప్రమాదంలో వాజీద్ తలకు, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆయనను ఎన్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.










