Miryalaguda : సాగర్ ఎడమ కాలువలో పడి వ్యక్తి మృతి..!
నాగార్జునసాగర్ ఎడమ కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మిర్యాలగూడ రూరల్ పరిధిలో చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్గయ్య తండా శివారు ప్రాంతంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువలో ఒక వ్యక్తి మృతదేహం లభించిందని ఎస్ ఐ నగేష్ తెలిపారు.

Miryalaguda : సాగర్ ఎడమ కాలువలో పడి వ్యక్తి మృతి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నాగార్జునసాగర్ ఎడమ కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మిర్యాలగూడ రూరల్ పరిధిలో చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగ్గయ్య తండా శివారు ప్రాంతంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువలో ఒక వ్యక్తి మృతదేహం లభించిందని ఎస్ ఐ నగేష్ తెలిపారు.
వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డి కుంటకు చెందిన ఆలేటి వీరబాబు (48) గా గుర్తించినట్లు తెలిపారు. మృతుడు గత కొంతకాలంగా వెరికోస్ వెయిన్స్ సమస్యతో పాటు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. సుమారు ఆరు సంవత్సరాల క్రితం వెరికోస్ వెయిన్స్ సమస్యకు శస్త్రచికిత్స చేయించు కున్నప్పటికీ, తిరిగి అదే సమస్య పునరావృతం కావడంతో తరచూ అనారోగ్య బాధలు అనుభవిస్తూ మనస్తాపానికి గురయ్యేవాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Also Read : District Collector : సైబర్ల్ నేరాలపై జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కీలక సూచన.. సైబర్ ముఠా అరెస్ట్..!
శనివారం ఉదయం సుమారు 9:00 గంటలకు మృతుడు తన పని నిమిత్తం సింధు సెలూన్‌కు వెళ్లగా, మధ్యాహ్నం ఇంటికి తిరిగి రాలేదు. అనంతరం నాగార్జునసాగర్ ఎడమ కాలువలో ఒక మృతదేహం కొట్టుకువస్తున్నట్లు సమాచారం అందడంతో స్థానికుల సహాయంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి, మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఆలేటి వీరబాబుదిగా గుర్తించారు.
కుటుంబ సభ్యుల వాంగ్మూలం ప్రకారం, మృతుడు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి మరణంపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మృతుని భార్య ఇచ్చిన ధరఖాస్తు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









