Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్తెలంగాణ

Breaking : సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య, రామంతపూర్ లో భారీ ప్రమాదం.. ఓకే క్లిక్ తో ఎన్నో బ్రేకింగ్ న్యూస్ 25/10/2026

మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఆదివారం బ్రేకింగ్ న్యూస్ మీకోసం..

Breaking : సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య, రామంతపూర్ లో భారీ ప్రమాదం.. ఓకే క్లిక్ తో ఎన్నో బ్రేకింగ్ న్యూస్ 25/10/2026

మన సాక్షి, వెబ్ డెస్క్ :

మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఆదివారం బ్రేకింగ్ న్యూస్ మీకోసం..

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య :

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. మాదాపూర్ పరిధిలోని చంద్రనాయక్ తండాలో తాను ఉంటున్న ఇంట్లో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. మృతురాలు ఉత్తరప్రదేశ్‌కు చెందిన అర్చన చౌదరి మాలిక్(29)గా గుర్తింపు. మైండ్‌స్పేస్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నది. కేసు నమోదు చేసి.. అర్చన ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్న పోలీస్ అధికారులు.

కండక్టర్‌ను బస్సులో నుంచి తోసేసిన ప్రయాణికురాలు :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో టికెట్ విషయంలో ప్రయాణికురాలికి, కండక్టర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ తోపులాటలో ప్రయాణికురాలు నెట్టేయడంతో కండక్టర్ రోడ్డుపై పడిపోగా, బస్సు టైరు ఆమె కాళ్లపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కండక్టర్‌ను వెంటనే భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రామంతపూర్‌లో ఘోర ప్రమాదం :

రామంతపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. స్క్రాప్ షాప్‌లో భారీ పేలుడు సంభవించింది. రామంతాపూర్ చర్చ్ కాలనీలో స్క్రాప్ షాపులో లోహం కట్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినది. ప్రమాదంలో స్క్రాప్ డీలర్ పరశురామ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడిని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలానికి అగ్నిమాపక సిబ్బంది చెట్టుకొని.. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.

Also Read : Nalgonda : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. దుకాణాలపై తూనికలు, కొలతల అధికారుల తనిఖీలు..!

ఏపీకి ముంచుకొస్తున్న తీవ్ర తుఫాను ముప్పు:

మచిలీపట్నం – విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్న తీవ్ర తుఫాను. గంటకు 115 నుంచి 125 కి.మీ (గరిష్టంగా 140 కి.మీ) వేగంతో వీచనున్న గాలులు. అక్టోబర్ 27: కాకినాడ, కోనసీమ, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు,
అక్టోబర్ 28 & 29: విశాఖ, అనకాపల్లి, ఏలూరు, గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, వైఎస్సార్ కడప, ఉత్తరాంధ్ర జిల్లాల్లో విపరీతమైన వర్షాలు రానున్నాయి. తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు మరియు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.

Also Read : Miryalaguda : సాగర్ ఎడమ కాలువలో పడి వ్యక్తి మృతి..!

బ్రీఫ్‌కేసులో రూ.4 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి :

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో తొలిసారిగా బ్రీఫ్‌కేసులో రూ.4 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి దొరికింది. కార్బన్ పేపర్ చుట్టి 4 వరుసల్లో 4 కిలోల గంజాయి, డాగ్ సాయంతో గుర్తించిన కస్టమ్స్ అధికారులు. బ్యాంకాక్ నుంచి సింగపూర్ మీదుగా రాత్రి 10:50కి వచ్చిన కోల్‌కతా వాసి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్. బ్యాంకాక్‌లో కిలో రూ.30 వేలు, భారత్‌లో రూ.కోటి వరకు ధర అని అధికారుల అంచనా.

సీఎం రేవంత్ రెడ్డి ముంబై పర్యటన :

నేడు రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌ నుంచి ముంబైకి బయలు దేరనున్న సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ కానున్నారు.తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై చర్చించనున్న ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు. ఈ సమావేశానికి హాజరుకానున్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఉన్నతాధికారులు.

కానిస్టేబుల్‌ను కొరికిన రాపిడో డ్రైవర్ :

హైదరాబాద్ చంద్రాయణగుట్ట సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన రాపిడో డ్రైవర్ అజీజ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను కొరికాడు. తనిఖీల సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన అతను కానిస్టేబుల్‌పై దాడి చేసి రోడ్డుపై హంగామా సృష్టించాడు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు అజీజ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు