Breaking Newsఆంధ్రప్రదేశ్క్రీడలు
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన చెంబకూరు విద్యార్థులు..!
అన్నమయ్య జిల్లా మదనపల్లె మిషన్ కాంపౌండ్ లో బుదవారం జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్ జి ఎఫ్ అండర్-14 మరియు అండర్-17 బాలికల హ్యాండ్ బాల్ సెలక్షన్స్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చెంబకూరు విద్యార్థినులు సత్తా చాటారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన చెంబకూరు విద్యార్థులు..!
(రామసముద్రం- రాజు, మనసాక్షి)
అన్నమయ్య జిల్లా మదనపల్లె మిషన్ కాంపౌండ్ లో బుదవారం జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్ జి ఎఫ్ అండర్-14 మరియు అండర్-17 బాలికల హ్యాండ్ బాల్ సెలక్షన్స్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చెంబకూరు విద్యార్థినులు సత్తా చాటారు.
పాఠశాలకు చెందిన పూర్వి, భవ్య, జాహ్నవి, స్నేహ మరియు చందనలు విశేష ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
Also Read : వీరబల్లి జెడ్పీటీసీగా చమర్తి శోభ ఏకగ్రీవం
వీరు నవంబర్ నెలలో ఏలూరు నందు జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా హ్యాండ్ బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని ప్రధానోపాధ్యాయులు రమేష్ బాబు తెలిపారు. ఎంపికైన విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులు రమేష్ బాబు, ఎస్ఎంసి చైర్మన్ సోమశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయులు దిలీప్ కుమార్, మంజులమ్మ మరియు పాఠశాల సిబ్బంది అభినందించారు.









