రేషన్ బియ్యానికి పాలిష్, కార్పొరేట్ బ్రాండ్ల పేరుతో విక్రయం.. వెనుక ఉన్నడెవరు..!
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం అక్రమ విక్రయాల వ్యవహారం కలకలం రేపుతోంది. పేదలకు పంపిణీ చే యాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమ వ్యాపారులు సేకరించి, పాలిష్ చేసి, కార్పొరేట్ బ్రాండ్ల పేర్లతో బయట మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

రేషన్ బియ్యానికి పాలిష్, కార్పొరేట్ బ్రాండ్ల పేరుతో విక్రయం.. వెనుక ఉన్నడెవరు..!
హైదరాబాద్, మన సాక్షి :
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం అక్రమ విక్రయాల వ్యవహారం కలకలం రేపుతోంది. పేదలకు పంపిణీ చే యాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమ వ్యాపారులు సేకరించి, పాలిష్ చేసి, కార్పొరేట్ బ్రాండ్ల పేర్లతో బయట మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవ హారంపై పౌరసరఫరాల శాఖ అ ధికారులు అప్రమత్తమయ్యారు.
కర్మన్‌ఘాట్‌లో అధికారుల మెరుపు దాడులు
రేషన్ బియ్యం అక్రమ దందాపై చర్యలకు దిగిన సివిల్ సప్లయ్స్, విజిలెన్స్ అధికారులు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏకకాలం లో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా కర్మన్‌ఘాట్ పరిధిలోని రైస్ డిపోలపై దాడులు నిర్వహిస్తూ బియ్యం నిల్వలు, విక్రయాల తీరును పరిశీలిస్తున్నారు.
పాలిష్ చేసి.. బ్రాండెడ్ బియ్యంగా మార్కెట్లోకి
రేషన్ బియ్యాన్ని సేకరించి, మిల్లుల్లో పాలిష్ చేయించి, సన్న బియ్యంగా మార్చి, ప్రముఖ కంపెనీ ల బ్రాండ్ల పేర్లతో మార్కెట్లో విక్ర యిస్తున్నట్లు ఆరోపణలు వినిపి స్తున్నాయి. ఈ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయి స్తున్నట్లు సమాచారం.
అక్రమ దందా వెనుక ఎవరున్నారు
పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న తీరుపై అధికారుల తనిఖీలు ప్రాధాన్యం సంతరించు కున్నాయి. ఈ అక్రమ వ్యాపారంలో ఎవరెవరి పాత్ర ఉంది? ఎంత మొత్తంలో బియ్యం పక్కదారి పట్టింది? బ్రాండెడ్ ప్యాకింగ్ వెనుక ఉన్న సంస్థలు ఎవరు? అనే అంశాలపై దర్యాప్తుతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధికారుల తనిఖీల్లో వెలుగుచూసే వివరాలు, స్వాధీనం చేసుకున్న బియ్యం నిల్వలు, బాధ్యులపై తీసుకునే చ ర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.









