Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్తెలంగాణ

BREAKING NEWS : రైతు ఖాతా నుంచి రూ.16 లక్షలు మాయం, ఆటోను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి.. మరెన్నో బ్రేకింగ్ న్యూస్ 30-10-26

మన సాక్షి పత్రిక తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఈరోజు శుక్రవారం 30-10-2026 బ్రేకింగ్ న్యూస్ మీకోసం..

BREAKING NEWS : రైతు ఖాతా నుంచి రూ.16 లక్షలు మాయం, ఆటోను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి.. మరెన్నో బ్రేకింగ్ న్యూస్ 30-10-26

మన సాక్షి, వెబ్ డెస్క్ :

మన సాక్షి పత్రిక తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తుంది. ఈరోజు శుక్రవారం 30-10-2026 బ్రేకింగ్ న్యూస్ మీకోసం..

ఆటోను ఢీకొట్టిన గ్యాస్ లారీ.. ఇద్దరు మృతి

తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామాల మధ్య ఉన్న గుర్రాల బొమ్మ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బూరుగుపూడి వైపు నుంచి వస్తున్న గ్యాస్ లారీ, గోకవరం నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

అర్నబ్‌ తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష :

అర్నబ్‌ తుపాను నష్టంపై డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష చేశారు. అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కాకినాడ జిల్లా అధికారులతో మాట్లాడి ఉప్పాడ తీర మత్స్యకారుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించిన డిప్యూటీ సీఎం.

నడుము లోతు నీటిలో అంతిమయాత్ర :

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం బుచ్చింపేటలో పిట్టా సూరి (60) అనారోగ్యంతో మృతి చెందారు. అర్నబ్ తుఫాను వర్షాలకు ఈరా చెరువు గెడ్డ పొంగి ప్రవహించడంతో గ్రామస్థులు వరద నీటిలోనే అంతిమయాత్ర సాగించారు. గెడ్డపై వంతెన నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

రైతు ఖాతా నుంచి రూ.16.8 లక్షలు స్వాహా :

సైబర్ నేరగాళ్ల చేతిలో పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రైతు మోసపోయాడు. మిర్చి, కందులు, పత్తి అమ్మగా వచ్చిన, పిల్లల చదువుల కోసం దాచుకున్న రూ.16,82,875 యూనియన్ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఖాతాల నుంచి మాయమయ్యాయి.
ఫోన్‌కు వచ్చిన ఓ పిక్‌ను తెలియక తెరవడంతో డబ్బులు పోయాయని, న్యాయం చేయాలని రైతు పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

యువకుడిపై కత్తులతో దాడి.. సీసీ ఫుటేజ్

పల్నాడు జిల్లా నరసరావుపేట శివారులో సమీర్ అనే యువకుడిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సమీర్‌ను ఆసుపత్రికి తరలించారు. పాత కక్ష్యలతోనే దాడి చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

NH-16పై వరద బీభత్సం.. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ :

శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. బాహుదా నది వరద ఉధృతి వల్ల ఇచ్చాపురం హైవేపైకి వరద నీరు చేరింది. హైవేపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి. నరసన్నపేట, టెక్కలి, పలాస హైవేలపై వాహనాలను నిలిపివేస్తున్న అధికారులు. నరసన్నపేట వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

తెలంగాణలో టీజీ సేఫ్‌ అధికారుల మెరుపు దాడులు :

ఉమ్మడి వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో టీజీ సేఫ్‌ అధికారుల మెరుపు దాడులు చేశారు. 10 ప్రత్యేక బృందాలతో 20 ఆహార తయారీ కేంద్రాల్లో సోదాలు. ఆహార పదార్థాల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకల వ్యర్థాలు గుర్తించిన అధికారులు. తనిఖీల్లో భారీగా బయటపడిన ఆహార భద్రతా ఉల్లంఘనలు. రూ.5.89 లక్షల విలువైన ఆహార పదార్థాలు సీజ్. లోపాలున్న 9 ప్రముఖ సంస్థల FSSAI లైసెన్సుల రద్దు.

బాహుదా వరదలో కొట్టుకుపోతున్న ఇద్దరు పిల్లలను కాపాడిన గ్రామస్థులు

బాహుదా వరదలో కొట్టుకుపోతున్న ఇద్దరు పిల్లలను గ్రామస్థులు కాపాడారు. ఒడిశాలో భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద బాహుదా నదికి వరద పోటెత్తింది. డొంకూరు వద్ద వరద నీటిలో కొట్టుకుపోతున్న ఇద్దరు పిల్లలను గ్రామస్థులు బుడ్డ లోకేష్, కోరాడ దానికీ రామ్ ప్రాణాలకు తెగించి కాపాడారు.

మరిన్ని వార్తలు