Gold Rate : మహిళలకు దీపావళి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!
తెలుగు రాష్ట్రాల మహిళలకు దీపావళి సందర్భంగా భారీ శుభవార్త అందింది. ఇటీవల కాలంలో బంగారం ధర భారీగా తగ్గుతూ వస్తుంది. తులం 24 క్యారెట్స్ బంగారం 1,82,000 వరకు వెళ్లిన విషయం తెలిసిందే.

Gold Rate : మహిళలకు దీపావళి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాల మహిళలకు దీపావళి సందర్భంగా భారీ శుభవార్త అందింది. ఇటీవల కాలంలో బంగారం ధర భారీగా తగ్గుతూ వస్తుంది. తులం 24 క్యారెట్స్ బంగారం 1,82,000 వరకు వెళ్లిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల పరిణామాల వల్ల జాతీయ అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం తులం బంగారం కు 40 వేల రూపాయలు తగ్గింది. ఈ క్రమంలోనే శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది.
దీపావళి పండుగకు మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నారు. కార్తీక మాసం సమీపిస్తుండటం వల్ల శుభకార్యాలు జరిగే అవకాశం ఉన్నందున బంగారం కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు.
Also Read : రేషన్ బియ్యానికి పాలిష్, కార్పొరేట్ బ్రాండ్ల పేరుతో విక్రయం.. వెనుక ఉన్నడెవరు..!
ఈరోజు తులం ఎంతంటే..?
శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 16,900 తగ్గి 14 లక్షల 22,600 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాములకు 15,500 తగ్గి 13 లక్షల 4 వేల రూపాయలకు చేరింది.
ఇదిలా ఉండగా 10 గ్రాముల (తులం) 24 క్యారెట్ బంగారంకు 1690 రూపాయలు తగ్గి 1,42,260 రూపాయలకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారంకు 1550 రూపాయలు తగ్గి 1,30,400 రూపాయలకు చేరింది. హైదరాబాద్ నగరం తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.









