Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District Collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ముగ్గురు అధికారులపై క్రిమినల్ కేసులకు ఫిర్యాదు..!

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీకి చెందిన భూమిని ప్రైవేట్‌ వ్యక్తుల పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యవహారంపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మున్సిపల్‌ ఆస్తి పన్ను రికార్డులను అక్రమంగా సృష్టించి, వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఆదేశించారు.

District Collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ముగ్గురు అధికారులపై క్రిమినల్ కేసులకు ఫిర్యాదు..!

సూర్యాపేట – ముత్యాంరాజు, మనసాక్షి

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీకి చెందిన భూమిని ప్రైవేట్‌ వ్యక్తుల పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యవహారంపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. మున్సిపల్‌ ఆస్తి పన్ను రికార్డులను అక్రమంగా సృష్టించి, వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఆదేశించారు. క్రిమినల్‌ ఫిర్యాదు నమోదు చేయడంతోపాటు, సమగ్ర విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు.

హుజూర్‌నగర్‌లో సుమారు 192 చదరపు గజాల స్థలంలో ఉన్న మున్సిపల్‌ బావి, పక్కనే ఉన్న భూమికి సంబంధించి ఈ వివాదం తలెత్తింది. ఈ స్థలానికి అక్రమంగా మున్సిపల్‌ ఆస్తి పన్ను మదింపు సృష్టించి, దానిని ప్రైవేట్‌ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. హుజూర్‌నగర్‌ ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌ ఇచ్చిన నివేదికల ఆధారంగా కలెక్టర్‌ చర్యలకు ఆదేశించారు.

ముగ్గురు అధికారులపై చర్యలు

ఆస్తి రికార్డుల సృష్టి, ధ్రువీకరణ, ప్రాసెసింగ్‌లో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గతంలో పనిచేసిన అప్పటి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ రెవెన్యూ ఆఫీసర్‌/రెవెన్యూ ఆఫీసర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ పై క్రమశిక్షణా చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం వారు ఎక్కడ పనిచేస్తున్నా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. సంబంధిత అవుట్‌సోర్స్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను తొలగించారు.

Also Read : రేషన్ బియ్యానికి పాలిష్‌, కార్పొరేట్ బ్రాండ్ల పేరుతో విక్రయం.. వెనుక ఉన్నడెవరు..!

రిజిస్ట్రేషన్‌ రద్దు

వివాదాస్పద స్థలాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. భూమి యాజమాన్యం, విస్తీర్ణం, హద్దులను నిర్ధారించి, రికార్డులను చట్టప్రకారం సరిచేయాలని సూచించారు.

క్రిమినల్‌ చర్యలుకు ఫిర్యాదు

మున్సిపల్‌ ఆస్తి రికార్డులను మోసపూరితంగా సృష్టించడం, దుర్వినియోగం చేయడం, అక్రమ లావాదేవీలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులపై క్రిమినల్‌ ఫిర్యాదు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో అనుసరించిన విధానంపై సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ ద్వారా నివేదిక కోరారు.

ఇతర ఆస్తులపైనా విచారణ

సూర్యాపేట అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు/రెవెన్యూ) ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టనున్నారు. మున్సిపల్‌ భూములు, బావులు, రోడ్లు, ప్రజా స్థలాలు, ఇతర ఆస్తులకు సంబంధించి జిల్లాలో ఇలాంటి అక్రమాలు జరిగాయా అనే అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. సంబంధిత అధికారులు, ప్రైవేట్‌ వ్యక్తుల పాత్రపై విచారణ జరిపి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రభుత్వ, మున్సిపల్‌ ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామని, అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు