పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి
వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్, చింతపల్లి మాజీ జడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి
– కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి పిలుపు
(చింతపల్లి – వెంకట్, మనసాక్షి)
వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్, చింతపల్లి మాజీ జడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read : District Collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ముగ్గురు అధికారులపై క్రిమినల్ కేసులకు ఫిర్యాదు..!
ఈ సందర్భంగా శుక్రవారం విలేకరులతో వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, పట్టభద్రుల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించి, వారి హక్కుల సాధనకు కృషి చేసే నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఓటరు నమోదును నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి కావాలి అని ఆమె కోరారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తుల్లో అర్హులైన పట్టభద్రులకు కూడా అవగాహన కల్పించి, ఓటరు నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.









