Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : ఎమ్మెల్యే బిల్ఆర్ కీలక పిలుపు.. సమిష్టి కృషితో ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొందాం..!

ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులందరి సమిష్టి కృషితో ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొందామని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.

Miryalaguda : ఎమ్మెల్యే బిల్ఆర్ కీలక పిలుపు.. సమిష్టి కృషితో ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొందాం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులందరి సమిష్టి కృషితో ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొందామని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నల్గొండ జిల్లా, మిర్యాలగూడ లోని కళావేదికలో ఎల్ నినో ప్రభావం- తీసుకోవాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపిస్తున్న దృష్ట్యా రాబోయే రోజుల్లో మనుషులు ,పశువులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, వ్యవసాయం, నీటిపారుదల, తాగునీరు, విద్యుత్ రంగాలలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ఇందుకుగాను అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులందరూ గ్రామాలకు వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు.

మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని 198 గ్రామపంచాయతీలు, 48 మున్సిపల్ వార్డుల్లో ఎల్ నినో ప్రభావం పై విస్తృతంగా తెలియజేసి నీరు, విద్యుత్తు, భూగర్భ జలాలు పొదుపుగా వాడేలా చూడాలన్నారు. ఎల్ నినో తీవ్రం కాకముందే జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తే రాబోయే కాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉంటారని అన్నారు. నాగార్జునసాగర్ నుండి నీరు ఇచ్చే అవకాశం లేనందున రైతులు అప్రమత్తంగా ఉండి యాసంగి లో వరి పంట వేయవద్దని, ఆరుతడి పంటలు వేయాలని కోరారు. గ్రామాలు , మున్సిపాలిటీ లలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని ,పశుగ్రాశం కొరత రాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

రైతులు తమ వద్ద ఉన్న పశుగ్రాసాన్ని డబ్బుల కోసం ఇతరులకు అమ్మకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలని, రాబోయే రోజుల్లో పశుగ్రాసం కొరత రాకుండా ఆదుకుంటుందని , వి బి జి రాంజీ కింద వాన నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని, ఇంకుడు గుంతలు ,ఊట కుంటలు ఏర్పాటు చేయాలన్నారు. బస్టాండ్లు, జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని, వచ్చే జనవరి నుండి బిఎల్ఆర్ ఫౌండేషన్ ద్వారా తన 12 నెలల జీతంతో ప్రజలకు తాగునీటితో పాటు, పెరుగన్నం ఏర్పాటు చేస్తానని తెలిపారు. సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామాలలోనే ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని వారికి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. దామరచర్ల పెద్ద చెరువును మూసి నీటితో నింపాలని జిల్లా కలెక్టర్ తో కోరారు.

శాసన మండలి సభ్యులు నేనావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ నీరు, విద్యుత్తు పొదుపుగా వాడాలని, యసంగిలో వరి వేయవద్దని, పంటల మార్పిడి పాటించాలని, జొన్నలు , పెసర్లు, మినుములు వంటి పంటలు వేసుకోవాలని, వి.బి.జి రాంజీ కింద ఫీడర్ ఛానళ్లు చేపట్టాలని, అలాగే నీటి నిలువ కట్టడాలు చేపట్టాలని, విద్యుత్ పొదుపుగా వాడుకోవాలని ,ఈ అన్ని విషయాలపై సర్పంచులు గ్రామాలలో అవగాహన కల్పించాలని కోరారు.

జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు గ్రామస్థాయి వరకు మంచి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సర్పంచులు, గ్రామ కార్యదర్శులు గ్రామాలలో నీటి వనరులను ఆడిట్ చేయాలని, గ్రామాలలో ఏ వనరులు ఉన్నాయి? ఎన్ని రోజులు నీళ్లు వస్తాయో విశ్లేషించాలని, నీటి లీకేజీలు లేకుండా, నీరు వృధా కాకుండా చూడాలని, నీటివనరులను కాపాడుకోవాలని, వివిజి రాంజీ కింద ఇంకా ప్రారంభం కాని పనులన్నింటిని వెంటనే ప్రారంభించాలని, నీటి నిలువ కట్టడాలు, కూలీలు ఎక్కువగా అవసరమయ్యే పనులు చేపట్టాలని, గ్రామాలలోని ప్రజలందరికీ సాధ్యమైనంతవరకు పని కల్పించాలని, రైతు వేదికలలో ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమాన్ని ,శుక్రవారం రైతుల అవగాహన సదస్సులను నిర్వహించడం జరుగుతున్నదని, వాటిని ఉపయోగించుకోవాలని, డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని, మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, డిమాండ్ ఉన్న పంటలకే మంచి ధర వస్తుందని, తక్కువనిడివి పంటలను , డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలని కోరారు.

ప్రతి ఒక్కరు నీటి పొదుపు సూత్రాలు పాటించాలని, నీటిని వృధా చేయవద్దని, ఇంటి పై పడ్డ ప్రతి వర్షం నీటిని నీటి నిల్వ కట్టడాలు, సోక్ పిట్లు ,వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కు మళ్లించాలని, విద్యుత్తును పొదుపు చేయాలని,ఎల్ నినో పరిస్థితులు, దాని ప్రభావం, తదనంతర పరిస్థితులపై వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని , సర్పంచులు, అధికారులు, గ్రామ కార్యదర్శులు గ్రామస్థాయి నుండి మొదలుకొని జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఎల్ నినో ,దాని ప్రభావం ప్రత్యామ్నాయ చర్యలు, తీసుకోవాల్సిన కార్యక్రమాలపై వివరించారు. వ్యవసాయ, భూగర్భ జలాలు, ఉద్యాన, తాగునీటి గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులు ఎల్ నినో నేపథ్యంలో వారి శాఖల ద్వారా రానున్న రోజుల్లో అమలు చేసే కార్యక్రమాలపై వివరించారు. మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి,మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధ జిల్లా అధికారులు, తదితరులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు