రుద్రతో డ్రగ్స్ పై తనిఖీలు..!
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట్ మండలం కొల్లూరు గ్రామంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు నవాబుపేట ఎస్‌ఐ నరేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు.

రుద్రతో డ్రగ్స్ పై తనిఖీలు..!
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి, మన సాక్షి
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట్ మండలం కొల్లూరు గ్రామంలో
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు నవాబుపేట ఎస్‌ఐ నరేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల ప్రత్యేక ‘రుద్ర’ స్నిఫర్ డాగ్ సహాయంతో కిరాణా దుకాణాలు, పాన్ షాపులు, అనుమానస్పద హోటల్లు షాపులో తనిఖీలు చేపట్టారు.
ALSO READ : రైతులకు బిగ్ అలర్ట్.. అందరూ ఇలా చేయాల్సిందే.. లేదంటే ప్రభుత్వ పథకాలు అందవు..!
ఈ ప్రాంతంలో ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, మాదకద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా అక్రమంగా మాదకద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్సై నరేందర్ తెలిపారు.









