Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

ఈ దొంగ మామూలోడు కాదు.. వెరీ కాస్ట్ లీ, కారులో వస్తాడు.. ఇల్లు గుల్ల చేస్తాడు..!

 ఈ దొంగ వెరీ కాస్ట్ లీ కారులో వస్తాడు. ఇల్లు గుల్ల చేస్తాడు. ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం తాళం వేసిన ఇల్లనే టార్గెట్ చేస్తాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులకు చిక్కాడు...

ఈ దొంగ మామూలోడు కాదు.. వెరీ కాస్ట్ లీ, కారులో వస్తాడు.. ఇల్లు గుల్ల చేస్తాడు..!

సూర్యాపేట, మనసాక్షి :

ఈ దొంగ వెరీ కాస్ట్ లీ కారులో వస్తాడు. ఇల్లు గుల్ల చేస్తాడు. ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం తాళం వేసిన ఇల్లనే టార్గెట్ చేస్తాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులకు చిక్కాడు…

సూర్యాపేట జిల్లా కోదాడపట్టణం లో వరుసగా ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ ను అరెస్ట రూ 60 లక్షల విలువైన 37.2 తులాల బంగారం, 470 గ్రాముల వెండి, రూ.3.60 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కే నర్సింహా తెలిపారు . సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో అరెస్ట్ వివరాలు, కేసుల దర్యాప్తు వివరాల ను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు.

కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళ తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా తాళాలు పగలగొట్టి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని కోదాడ పట్టణ పోలీసులు మరియు జిల్లా సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
నిందితుడు : పట్నం శెట్టి రాజు అలియాస్ రాజీ రెడ్డి కారు డ్రైవర్, నివాసం పాపిరెడ్డినగర్ కాలనీ, జగద్గిరిగుట్ట కు చెందిన ఇతను ఎలాగైనా సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం తో 2009 లో ఖమ్మం పోలీస్ స్టేషన్ లో మొదటగా సైకిల్ దొంగతనం చేసి జైల్ కు వెళ్ళినాడు.

ఆ తరువాత 2015, 2016 సంవత్సరం లో మొదటగా జగద్గిరి గుట్ట పరిధిలో లో అయిదు ఇళ్ళలో రాత్రి పూట దొంగతనాలు చేసినాడు. ఇట్టి కేసులలో జగద్గిరి గుట్ట పోలీసు వారు పట్టుకొని రీమాండ్ కు పంపించినారు. నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రి సమయంలో తన కారును నిర్మానుష్య ప్రదేశంలో నిలిపి, నడుచుకుంటూ వెళ్లి తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకునేవాడన్నారు.

నిందితుడు స్క్రూడ్రైవర్, చేతి గ్లౌజులకు బదులుగా షూ సాక్స్ ఉపయోగిస్తూ, ఇంటి ప్రధాన ద్వారం తాళాలను పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించేవాడు. బంగారు, వెండి ఆభరణాలు మరియు నగదును దొంగిలించేవాడు. దొంగిలించిన ఆభరణాలలో కొన్నింటిని అమ్మడం, కొన్నింటిని కరిగించడం, మరికొన్నింటిని ఫైనాన్స్ సంస్థలో కుదవ పెట్టడం ద్వారా వచ్చిన డబ్బును తన వ్యక్తిగత అవసరాలకు మరియు అప్పుల చెల్లింపులకు వినియోగించేవాడు.

అలాగే తన కారు అసలు రిజిస్ట్రేషన్ నంబర్ AP 28 BY 7770కు బదులుగా నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్ TS 07 GC 1612ను ఉపయోగిస్తూ పోలీసులకు అనుమానం రాకుండా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడేవాడన్నారు . కోదాడ పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్న విషయమై పోలీస్ శాఖ కోదాడ పట్టణంలో పటిష్ట నిఘా ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలను సేకరించి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని గుర్తించడం జరిగిందన్నారు.

ALSO READపోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!

అరెస్టయిన నిందితుడు రాజు అలియాస్ రాజిరెడ్డి. హైదరాబాద్ నుంచి ప్రయాణికులను కారులో కోదాడకు తీసుకువచ్చి, రాత్రి సమయంలో కోదాడలోనే ఉండేవాడు. నిర్మానుష్య ప్రాంతంలో కార్ పార్కింగ్ చేసి తెల్లవారుజామున పట్టణంలో సంచరిస్తూ, తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడేవాడు అని తెలిపారు.నిందితుడు కోదాడ పట్టణంలో 2021 నుండి ఇప్పటి వరకు 10 దొంగతనాలకు పాల్పడినాడు, 2026 సంవత్సరంలో 7 ఇండ్లలో దొంగతనాలు చేశాడన్నారు

నమ్మదగిన సమాచారం పై బుధవారం ఉదయం నిందితుడు దొంగిలించిన బంగారు వస్తువులను విజయవాడకు తీసుకెళ్లి విక్రయించాలనే ఉద్దేశంతో తన కారులో సూర్యాపేట నుండి కోదాడ పట్టణంలోని ఫ్లైఓవర్ మీదుగా హుజూర్‌నగర్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్న సమయంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండటాన్ని గమనించాడు. పోలీసులను చూసి భయపడి వాహనాన్ని వెనక్కి తీసుకొని తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

వాహనాన్ని తనిఖీ చేయగా డిక్కిలోని కవర్లలో బంగారు, వెండి ఆభరణాలు మరియు నగదు లభించాయి. అలాగే స్క్రూడ్రైవర్లు మరియు షూ సాక్స్‌లు కూడా లభించడంతో అనుమానం మరింత బలపడింది. అనంతరం నిందితుడు కోదాడ పట్టణంలో తాను చేసిన దొంగతనాల గురించి వెల్లడించారూ.. నిందితుడు ఉపయోగించిన హోండా అమజ్ కారు మరియు వివో వై 31 5జి మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచి రిమాండ్‌కు పంపడం జరుగుతుంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నర్సింహ, మాట్లాడుతూ, నేరాలకు పాల్పడిన వారు ఎప్పటికైనా చట్టానికి చిక్కక తప్పదని అన్నారు. ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, కాలనీల్లోని ప్రధాన మార్గాల్లో కూడా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అలారం సిస్టమ్ పెట్టుకోవాలని అన్నారు, ఎక్కువ రోజులు ఇండ్లకు తాళం పెట్టీ వెళ్లేవారు విలువైన వస్తువులు, డబ్బు ఇంట్లో ఉంచవద్దు అని కోరారు, ఇరుగు పొరుగు వారికి, స్థానిక పోలీస్ స్టేషన్ నందు సమాచారం ఇవ్వాలని కోరారు.

ALSO READ70వ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం..!

అనుమానస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే డయల్ 112 కు సమాచారం ఇవ్వాలని అన్నారు. దొంగతనాల నివారణలో ప్రజలు పోలీసులకు సహకరిస్తూ పోలీసు శాఖతో భాగస్వాములు కావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తూ, నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

దొంగతనాల కేసు చేధి చడంలో పర్యవేక్షణ చేసిన కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, నిధితుణ్ణి అరెస్ట్ చేయడంలో బాగా పని చేసిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ శివంశంకర్, సిసిఎస్ ఎస్ఐ లు హరికృష్ణ, సాయిరాం, ఎస్ఐ అజయ్ కుమార్, సిసిఎస్ సిబ్బంది వెంకన్న, విద్యాసాగర్, మల్లేష్, సతీష్, శివ, ప్రభాకర్, మంజుల ని అభినందించి రివార్డ్ అందింజేశారు.

మరిన్ని వార్తలు