Breaking NewsTOP STORIESఉద్యోగంతెలంగాణ
పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రభుత్వం భారీ శుభవార్త తెలియజేసింది.

పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో:
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రభుత్వం భారీ శుభవార్త తెలియజేసింది. దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు సెప్టెంబర్ 16వ తేదీ చివరి గడువుగా నిర్ణయించింది. పోలీసు శాఖలో 7437 ఉద్యోగాలకు జూలై 29వ తేదీన పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకు సంబంధించి అభ్యర్థులు సెప్టెంబర్ 9వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నది.
రేపటితో దరఖాస్తుల గడువు ముగియనుండడంతో మరో వారం రోజులపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించింది.
MOST VIEWS :
- దేవరకొండ సబ్ కలెక్టర్ గా కరోలిన్ చింగిటయాన్ మావి.. బాధ్యతలు స్వీకరణ.. ఎవరో తెలుసా..!
- దేవరకొండ సబ్ కలెక్టర్ గా కరోలిన్ చింగిటయాన్ మావి.. బాధ్యతలు స్వీకరణ.. ఎవరో తెలుసా..!
- Miryalaguda : శిక్షా రత్నా అవార్డ్ అందుకున్న కే ఎల్ ఎన్ కాలేజీ ప్రిన్సిపాల్స్..!
- సూర్యాపేట జిల్లాలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం, ఇద్దరి అరెస్ట్..!









