Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

కెసిఆర్ ఫామ్ హౌస్ కు వెళ్తున్న కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

బిఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లతోపాటు పలువురు బిఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రవల్లిలోని కెసిఆర్ ఫామ్ హౌస్ కు వెళ్తుండగా పోలీసులు వీరిని అడ్డుకొని అరెస్టు చేశారు.

కెసిఆర్ ఫామ్ హౌస్ కు వెళ్తున్న కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

మన సాక్షి, హైదరాబాద్ :

బిఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లతోపాటు పలువురు బిఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రవల్లిలోని కెసిఆర్ ఫామ్ హౌస్ కు వెళ్తుండగా పోలీసులు వీరిని అడ్డుకొని అరెస్టు చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందనే కారణంతో వారు వెళుతున్న వాహనాలను అడ్డుకున్నారు. కాగా వాహనాలు ఆడుకోవడంతో హరీష్ రావు, కేటీఆర్ లు నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు.

కానీ వారితో పాటు పలువురు నేతలను హకీంపేట వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కేటీఆర్ ను బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు, హరీష్ రావును జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమ అధినేతను కలిసేందుకు వెళుతుండగా అరెస్టు చేయడం ఏంటని వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఇదిలా ఉండగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద ఎమ్మెల్సీ తాత మధు వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. హరీష్ రావు, కేటీఆర్ లు ఫామ్ హౌస్ కు వెళ్తే మరింత ఉద్రిక్తల్లో పెరిగే అవకాశం ఉందని పోలీసులు ముందస్తుగా వారిని అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు