Breaking Newsక్రైంజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా
పేకాట స్థావరాలపై పోలీసుల దాడి, ఎనిమిది మంది అరెస్టు..!
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ధర్మారం మండలంలోని మేడారం గ్రామా శివారులో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి 8 మందిని అరెస్టు చేశారు.

పేకాట స్థావరాలపై పోలీసుల దాడి, ఎనిమిది మంది అరెస్టు..!
ధర్మారం, మన సాక్షి,
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ధర్మారం మండలంలోని మేడారం గ్రామా శివారులో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి 8 మందిని అరెస్టు చేశారు. పోచమ్మ బోరు వెనుకాల మేడారం గ్రామానికి చెందిన ఎల్తూరి పవన్, చీకట్ల కుమార్, కడారి అరుణ్, బొంకూరి మొండయ్య, మేడారం అజయ్, బొద్దు మహేందర్, ఎల్తూరి నివాస్, బొంకూరి మహేందర్ పేకాట ఆడుతుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుండి 3090 రూపాయలు మరియు నాలుగు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొంతమంది పరారీ లో ఉన్నట్టు అని ధర్మారం ఎస్ ఐ ఈ శ్రీకాంత్, తెలిపారు.









