Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణవ్యవసాయం

తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్.. ఆ స్కీం పొందాలంటే 10వ తేదీ చివరి గడువు..!

తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్.. ఆ స్కీం పొందాలంటే 10వ తేదీ చివరి గడువు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం రైతులకు బిగ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలో సాగు చేస్తున్న రైతులకు సన్నరకం పండించే వారికి ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల బోనస్ అందజేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది సన్నరకం దాన్యం పండించే రైతుల వివరాలను ముందస్తుగానే సేకరించి ఆన్ లైన్ లో నమోదు చేసే ప్రక్రియను చేపట్టింది. అందుకు గాను సన్నరకం దాన్యం సాగు చేసే రైతులు వ్యవసాయ అధికారుల వద్ద పేర్లు, సాగు విస్తీర్ణం నమోదు చేసుకోవలసిన అవసరం ఉంది.

ALSO READసూర్యాపేట జిల్లాలో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం, ఇద్దరి అరెస్ట్..!

విత్తన దుకాణాల వద్ద కొనుగోలు చేసిన రైతుల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నందున వ్యవసాయ అధికారులకు ఆ వివరాలను పంపించే అవకాశాలున్నాయి. కానీ రైతులు నేరుగా విత్తనాలను తయారు చేసుకొని సాగు చేసే రైతులు తప్పనిసరిగా వ్యవసాయ అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలి.

మొత్తంగా సన్న రకం దాన్యం సాగు చేసే రైతులు పూర్తి స్థాయిలో వ్యవసాయ అధికారుల వద్ద పేర్లు, సాగు విస్తీర్ణం నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకుగాను ఈనెల 10వ తేదీ చివరి గడువుగా ప్రభుత్వం నిర్ణయించింది. గడువు దాటిన తర్వాత వివరాలు ఇస్తే నమోదు చేసుకునేది లేదని వ్యవసాయ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

ALSO READ9,10 తేదీల్లో 70వ మండల స్థాయి క్రీడా పోటీలు..!

వ్యవసాయ అధికారుల వద్ద ఉన్న సన్నరకం దాన్యం సాగు వివరాల ఆధారంగానే రైతులకు బోనస్ అందించే అవకాశం ఉంది. రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నందున అవి పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. అందుకుగాను సన్నరకం దాన్యం సాగు చేసే రైతుల వివరాలు సాగు విస్తీర్ణంలో ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారు. ఇప్పటికే ఏడు రకాల సన్నధాన్యం పండించిన రైతులకే బోనస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

అదేవిధంగా సన్నధాన్యం పండించే రైతుల వివరాలు ఆన్ లైన్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అలాంటి వారికి బోనస్ అందే అవకాశం ఉంది. అందుకు గాను గడువు కేవలం మరో రెండు రోజులు మాత్రమే ఉన్నందున రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.

ALSO READసీజ్ మాయజాలం.. కార్పొరేట్ స్కూల్ బరితెగింపు..!

మరిన్ని వార్తలు