Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking News

నందుస్ వరల్డ్ యూట్యూబర్ అరెస్ట్..!

ప్రముఖ యూట్యూబర్ నందుస్ వరల్డ్ నందనను హైదరాబాద్ పోలీసులు ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. లండన్ లో ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారని ఆరోపణలపై ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

నందుస్ వరల్డ్ యూట్యూబర్ అరెస్ట్..!

మన సాక్షి, హైదరాబాద్:

ప్రముఖ యూట్యూబర్ నందుస్ వరల్డ్ నందనను హైదరాబాద్ పోలీసులు ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. లండన్ లో ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారని ఆరోపణలపై ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో గుర్తింపును ఉపయోగించుకొని హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో కార్యాలయాలు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడ్డారని పలువురు బాధితులు ఆరోపించారు.

వీసా రెన్యువల్ తన భార్యకు ఉద్యోగం కోసం సి ఓ ఎస్ ఇప్పిస్తానని తన వద్ద జాగర్లమూడి రామనందన అలియాస్ నందన, ఆమె భర్త మధుకర్ 15 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కు చెందిన మామిళ్ళపల్లి శివ క్రాంతి కుమర్ ఫిర్యాదు చేశారు.

అయితే నందన కుటుంబం పై గత ఏడాది డిసెంబర్లో కేసు నమోదు అయింది. ఈ కేసులో ఏవన్ గా నందన, ఎ2గా ఆమె భర్త మధుకర్, A3 గా ఆమె మామ మోహన్రావు పేర్లను పేర్కొంటూ ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా నిందితుల కోసం లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. నందన ఆచూకీ కోసం A3 మోహన్రావును విచారణ చేయగా తన కుమారుడు, కోడలు ఎక్కడున్నారో తెలియదు అంటూ తప్పించుకున్నాడు. అయితే ఆయనకు 41 నోటీసులు జారీ చేశారు.

సోమవారం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆమె ప్రత్యక్షమైంది. లుక్ అవుట్ నోటీసులు ఉండడంతో వెంటనే ఇమిగ్రేషన్ అధికారుల నుంచి ఇబ్రహీంపట్నం పోలీసులు సమాచారం అందింది. ఇబ్రహీంపట్నం పిఎస్ లోని ఎస్సై సత్యవతిని హైదరాబాద్ పంపి నందనకు 35 బి ఎం ఎస్ నోటీసులు అందించారు. మంగళవారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించనున్నారు.

మరిన్ని వార్తలు